కియారా కిస్సు ముచ్చట్లు!

బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ తారగా వెలిగిపోతుంది. వరస సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సౌత్ పిలిచినా [more]

Update: 2020-12-14 10:27 GMT

బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ తారగా వెలిగిపోతుంది. వరస సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సౌత్ పిలిచినా రాలేని పరిస్థితి. నిన్నగాక మొన్న హ్రితిక్ రోషన్ సినిమాలో కియారా అద్వానీ ఎంపికైందనే న్యూస్ తో అమ్మడు క్రేజ్ మరింతగా పెరింది. అయితే ప్రస్తుతం ఇందూ కి జవానీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కియారా అద్వానీ చేస్తున్న బోల్డ్ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. కియారా ప్రేమలో ఉంది.. బాలీవుడ్ లో బాయ్ ఫ్రెండ్ ని మెయింటింగ్ చేస్తూ వెకేషన్స్ కి వెళుతూ.. డేటింగ్ చేస్తుందనే న్యూస్ ఉంది.

కియారా ఇప్పుడు ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. తాను చిన్నప్పుడే ప్రేమలో పడ్డా అని.. కానీ తన కుటుంబం వలన అది వదులుకోవాల్సి వచ్చింది అంటుంది. ఫ్యామిలీ విషయంలో తాను చాలా ఎమోషనల్ అని.. అందుకే తన ప్రేమ విషయంలో వాళ్ళు కఠినంగా ఉంటే అప్పట్లో బాయ్ ఫ్రెండ్ ని మిస్ అయ్యా అని, చదువు మీద శ్రద్ద పెట్టమని నా తల్లితండ్రులు చెప్పబట్టే నేను అతన్ని మిస్ చేసుకున్నా అంటుంది. ఇక ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తే.. మొదటి డేట్ లోనే ముద్దు ఇచ్చెయ్యనని.. ముద్దు కోసం నా వెంట పడేలా చేసుకుంటానంటుంది కియారా అద్వానీ. ఇక తన మనసుకు నచ్చినవాడు దొరికితే డేటింగ్ చెయ్యడానికి సిద్ధం అంటూ అబ్బాయిలకి ఆఫర్ ఇచ్చింది కియారా. 

Tags:    

Similar News