సెలెబ్రిటీ హోదా అంటే..!
రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో టాలీవుడ్ లో సినిమాలు చేసి.. బాలీవుడ్ కి చెక్కేసి అక్కడే సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా [more]
రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో టాలీవుడ్ లో సినిమాలు చేసి.. బాలీవుడ్ కి చెక్కేసి అక్కడే సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా [more]
రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో టాలీవుడ్ లో సినిమాలు చేసి.. బాలీవుడ్ కి చెక్కేసి అక్కడే సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈమధ్యన టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ కి హ్యాండ్ ఇచ్చి.. రామ్ చరణ్ తో సై అందనే న్యూస్ ఉంది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాకి కియారా నో చెప్పడమే కాదు.. శంకర్ – రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీకి ఓకె చెప్పిందట. అయితే కియారా అద్వానీ మాత్రం నేను స్టార్ ని అనుకోవడం లేదు.. కేవలం ఓ నటిని మాత్రమే అంటుంది. నా లక్ష్యం చాలా పెద్దది. నాకు స్టార్ డమ్ వచ్చింది కదా అని.. నా కెరీర్ ఇక్కడ ఆగిపోకూడదు.
ప్రస్తుతం నా కొచ్చిన స్టార్ డమ్ ని ఎక్కువ కాలం నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను. సెలెబ్రిటీ హోదా అనేది మనపై మానసిక ఒత్తిడి తీసుకువస్తుంది. ఆ సెలెబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము. అందుకే నేను ఎప్పుడూ స్టార్ లా ఫీలవ్వను.. కేవలం నటిగానే ఉండాలనుకుంటాను. ప్రస్తుతం నాకొచ్చిన స్టార్ డమ్ ని చూసి నేను నిర్ణయాలు తీసుకోను. ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండాలంటే ఏం చెయ్యాలో అదే చేస్తాను. హీరోయిన్ గా నా కెరీర్ మొదలైనప్పుడు ఎలా ఉన్నానో.. కెరీర్ చివరి వరకు అలానే ఉండాలని కోరుకుంటానంటుంది కియారా అద్వానీ.