టాలీవుడ్ వద్దనుకున్న అందం ఎంత బావుందో?

భరత్ అనే నేను సినిమాతో స్టార్ హీరో మహేష్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కిర్రాక్ పోరి కియారా అద్వానీ… ఆ సినిమా హిట్ ఆవకుండానే రామ్ [more]

Update: 2019-08-02 06:39 GMT

భరత్ అనే నేను సినిమాతో స్టార్ హీరో మహేష్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కిర్రాక్ పోరి కియారా అద్వానీ… ఆ సినిమా హిట్ ఆవకుండానే రామ్ చరణ్ తో వినయ విధేయరామ తో జోడి కట్టింది. ఇక రామ్ చరణ్ కి వినయ విధేయరామ ఎంత డ్యామేజ్ చేసిందో తెలియదు కానీ… కియారకి మాత్రం టాలీవుడ్ కి మల్లి ఎంట్రీ ఇవ్వకుండా చేసింది. వినయ విధేయరామ దెబ్బకి అల్లు అర్జున్ కూడా మొహం చాటేశాడు కియారాకి. లేదంటే త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ జోడి కియారనే. వినయ విధేయరామ సినిమా ఘోరంగా పోవడంతో టాలీవుడ్ దర్శకులు కియారా వైపు చూడడమే మానేశారు. కానీ బాలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది ఈ బాలీవుడ్ సుందరికి. తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో కియారా బోల్డ్ గా షాహిద్ కపూర్ పక్కన నటించి పిచ్చ హిట్ కొట్టడమే కాదు… అక్కడి దర్శకనిర్మాతల దృష్టి ఒక్కసారిగా తన మీద పడేలా చేసుకుంది.

మరి కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ సరసన హాట్ హాట్ గా రొమాంటిక్ గా లిప్ లక్స్ తో రెచ్చిపోయి నటించిన కియారా అందాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కియారా బర్త్ డే వేడుకల్లో కియారా వేసుకున్న వైట్ డ్రెస్ లో క్లివేజ్ అందాలతో అదిరిపోయే స్మైల్ తో గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటూ అదరగొడుతున్న కియారా ని చూసిన ఎవ్వరైనా అయ్యో ఇంతందాన్ని టాలీవుడ్ మిస్ అవుతుందే అనిపిస్తుంది. కియారా ని అలా చూస్తుంటే చూపు తిప్పుకోవడం కూడా అసాధ్యం అనేలా వుంది ఆమె అందం. మరి కేవలం బర్త్ డే పార్టీలోనే కాదు కవర్ పేజెస్ మీద కూడా కియారా సందడే వేరు అన్నట్టుగా ఉంది ఆమె వ్యవహారం. ఇక రెండు మూడు సినిమాలు వరస హిట్ అయితే కియారా బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లోకెళ్ళిపోతుంది.

Tags:    

Similar News