పాత్ర నచ్చాలి.. పారితోషకం కాదు?

ఈమాటన్నది ఎవరో కాదు బాలీవుడ్ టాప్ లిస్ట్ లోకి వెళ్ళబోతున్న కియారా అద్వానీ. తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ [more]

Update: 2020-04-18 03:10 GMT

ఈమాటన్నది ఎవరో కాదు బాలీవుడ్ టాప్ లిస్ట్ లోకి వెళ్ళబోతున్న కియారా అద్వానీ. తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయరామ సినిమాలు చేసిన కియారా అడ్వాణీకి తెలుగులో ఓ అన్నంత సక్సెస్ దక్కలేదు కానీ.. బాలీవుడ్ లో ఈ భామకి డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేని సక్సెస్ అందుకుంది. చేతినిండా సినిమాల్తో   బాలీవుడ్ ని ఏలుతున్న కియారా అద్వానీకి ఈమధ్యన టాలీవుడ్ నుండి ఆఫర్స్ వెళుతున్నాయని… బాలీవుడ్ లో హిట్స్ మీదున్న కియారా అధిక పారితోషకం డిమాండ్ చేస్తూ దర్శకనిర్మాతలకు చుక్కలు చూపెడుతుంది అనే ప్రచారం జరుగుతుంది.

అయితే ఆ ప్రచారం ఆనోటా ఈ నోటా కియారా చెవిన పడగా.. కియారా కి బాగా కాలింది. దానితో కియారా అద్వానీ… నాకు టాలీవుడ్ నుండి నుంచి నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే నేను సౌత్ సినిమాలు చేయలేకపోతున్నాను. అయితే తెలుగులో కథ .. నా పాత్ర నచ్చినప్పుడే ఓకే చెప్పాలనే నిర్ణయంతో వున్నాను. అంతేగానీ పారితోషికం తక్కువైతే చేయనని నేను ఎప్పుడూ ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదు.. అంటూ తనపై జరుగుతన్న దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది.

Tags:    

Similar News