మహేష్ హీరోయిన్ కి సౌత్ లో మరో అవకాశం?

సౌత్ లో రెండు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ… తెలుగు ప్రేక్షకులను గ్లామర్ తో పడేసింది. భరత్ అనే నేను లో యంగ్ [more]

Update: 2019-06-06 03:44 GMT

సౌత్ లో రెండు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ… తెలుగు ప్రేక్షకులను గ్లామర్ తో పడేసింది. భరత్ అనే నేను లో యంగ్ సీఎం మహెష్ ని ప్రేమించే మిడిల్ క్లాస్ అమ్మాయిగా అదరగొట్టింది. కాకపోతే మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి చేసిన వినయ విధేయరామ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో అమ్మడు మళ్ళీ బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసింది. అక్కడ వరస సినిమాల్తో బాగా బిజీ అయ్యింది. ప్రస్తుతం తెలుగు రీమేక్ కబీర్ సింగ్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తుంది. కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ తో లిప్ లాక్స్ తో సెగలు పుట్టిస్తున్న కియారా అద్వానీ కి బాలీవుడ్ లో వరస అవకాశాలొస్తున్నాయి.

తాజాగా సౌత్ నుండి కియారా అద్వానీకి మరో ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అది కూడా తమిళ ఆఫర్ అట. తమిళంలో నయనతార ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కించబోయే సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నాడట. విగ్నేష్ శివన్, శివ కార్తికేయన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమాలో శివ కార్తికేయన్ కి జోడిగా కియారా అద్వానీని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. మరి ఈ ఛాన్స్ గనక కియారాకి దొరికితే సౌత్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే శివ కార్తికేయన్ సినిమాలో కియారా అద్వానీ ఫైనలా.. లేదా.. అనేది మాత్రం స్పష్ట రావాల్సి ఉంది.

Tags:    

Similar News