అర్జున్ రెడ్డి భామ మాదిరిగానే..!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బోల్డ్ కంటెంట్ తో విజయ్ దేవరకొండ – షాలిని పాండేలను హీరోహీరోయిన్స్ గా పెట్టి అర్జున్ రెడ్డి అనే సినిమా తెరకెక్కించాడు. [more]

Update: 2019-05-14 06:24 GMT

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బోల్డ్ కంటెంట్ తో విజయ్ దేవరకొండ – షాలిని పాండేలను హీరోహీరోయిన్స్ గా పెట్టి అర్జున్ రెడ్డి అనే సినిమా తెరకెక్కించాడు. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా కాంట్రావర్సీలకు వేదికగా మారింది. విజయ్ దేవరకొండ – షాలిని పాండే లిప్ లాక్స్, రొమాంటిక్ సన్నివేశాలు అర్జున్ రెడ్డి సినిమాని యూత్ కి బాగా కనెక్ట్ చేశాయి. అర్జున్ రెడ్డిగా విజయ్ ఇరగదీసాడు. విజయ్ దేవరకొండకి పోటీగా షాలిని పాండే కూడా ప్రీతీ క్యారెక్టర్ లో బోల్డ్ గా నటించి దుమ్మురేపింది. అర్జున్ రెడ్డి అలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో తెలుగు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే షాహిద్ కపూర్ – కియారా అద్వానీ హీరోహీరోయిన్స్ గా కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కూడా సేమ్ తెలుగు విజయ్ దేవరకొండ మాదిరిగా కబీర్ సింగ్ పాత్రలో అదరగొట్టేస్తున్నాడు.

ఆదుర్స్ అనిపించిన కియారా

లుక్స్, యాటిట్యూడ్, స్టయిల్ అన్నీ విజయ్ దేవరకొండ మాదిరిగా షాహిద్ కూడా మారిపోయాడు. తాజా పోస్టర్, కబీర్ సింగ్ ట్రైలర్ కూడా అర్జున్ రెడ్డికి మక్కీకి మక్కీ దింపినా కబీర్ సింగ్ ట్రైలర్ అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది. ఇక తెలుగు అర్జున్ రెడ్డిలో ప్రీతీ పాత్రని షాలిని పాండే ఎలాంటి బెరుకు లేకుండా పోషించి శెభాష్ అనిపించుకుంది. ప్రీతీ పాత్రని బాలీవుడ్ లో కియారా అద్వానీ పోషించింది. షాలినికి ఏ మాత్రం తీసిపోకుండా కియారా అద్వానీ కూడా ఆ బోల్డ్ క్యారెక్టర్ లో అదరగొట్టడమే కాదు.. షాహిద్ కపూర్ తో లిప్ లాక్స్ లోనూ రెచ్చిపోయింది. చాలా డీసెంట్ గా కియారా అద్వానీ నటన ఉంది. మరి కబీర్ సింగ్ పక్కా హిట్ అందులో షాహిద్ కపూర్ కి ఎంతగా పేరొస్తుందో.. కియారకీ అంతే పేరొస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను కియారా మీద పడడం ఖాయం.

Tags:    

Similar News