ఇంతకీ ఎవరితో కియారా?
టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేక బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ సక్సెస్ అయ్యి.. టాప్ రేంజ్ లో కూర్చున్న కియారా అద్వానీ.. ప్రస్తుతం అక్కడ మోస్ట్ [more]
టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేక బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ సక్సెస్ అయ్యి.. టాప్ రేంజ్ లో కూర్చున్న కియారా అద్వానీ.. ప్రస్తుతం అక్కడ మోస్ట్ [more]
టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేక బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ సక్సెస్ అయ్యి.. టాప్ రేంజ్ లో కూర్చున్న కియారా అద్వానీ.. ప్రస్తుతం అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అక్కడ కియారా క్రేజ్ పెరగ్గానే సౌత్ లో ఆమెకున్న ప్లాప్స్ ని పక్కనబెట్టేసి మళ్ళీ ఆమె వెంట పడుతున్నారు సౌత్ దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఆమెకి సౌత్ నుండి అవకాశాలు వెళుతున్నా.. ఆమె ఒప్పుకోవడం లేదు. కానీ ప్రసుతం తాను ఓ సౌత్ మూవీ చెయ్యబోతున్నట్టుగా కన్ ఫర్మ్ చేసింది. అయితే అది రామ్ చరణ్ తోనా? లేదంటే ఎన్టీఆర్ తోనా? అనేది కన్ ఫర్మ్ చెయ్యకుండా కన్ఫ్యూజన్ లో పెట్టింది.
అంటే ఎన్టీఆర్ – కొరటాల కాంబో NTR30 కోసం కియారా ని ఎంపిక చేశారనే టాక్ ఉంది. మరోపక్క శంకర్ – రామ్ చరణ్ కాంబో మూవీ లో శంకర్ కియారా అద్వానీని సంప్రదిస్తున్నాడనే టాక్ ఉంది. ఆ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్. మరి కియారా ఆ రెండు సినిమాల్లో ఏ సినిమాలో నటిస్తుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ సౌత్ ఇండియన్ సినిమాకి త్వరలోనే భాగం కాబోతున్నట్లుగా కియారా అద్వానీ కన్ ఫర్మ్ చేసింది. త్వరలోనే దానికి సంబందించిన ఒక ఎగ్జైటింగ్ అనౌన్సమెంట్ కూడా వస్తుందని తెలిపింది. మరి ఆ ప్రకటన ఎన్టీఆర్ తోనా? లేదంటే రామ్ చరణ్ తోనా? అనేది తెలియాల్సి ఉంది.