కొరటాలను బుజ్జగిస్తున్న చరణ్..!

ప్రస్తుతం ‘సైరా’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి ఈ మూవీ తరువాత కొరటాల డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ [more]

Update: 2019-01-03 10:02 GMT

ప్రస్తుతం ‘సైరా’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి ఈ మూవీ తరువాత కొరటాల డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొరటాల ‘భరత్ అనే నేను’ సినిమా తరువాత వెంటనే చిరుకి ఓ కథ చెప్పి ఓకే చేయించుకుని 8 నెలలు పైనే అవుతుంది. మరో 6 నెలలు పైనే పెట్టే అవకాశముంది. ఏప్రిల్ లేదా మే నుండి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దీంతో అంతవరకు కొరటాల వెయిట్ చేయలేక ఈ చిత్రాన్ని వదిలి వేరే చిత్రం మీద ఫోకస్‌ పెట్టాలని భావిస్తున్నాడు.

భారీ పారితోషకం ఆఫర్ చేసి మరీ

అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణం అయిన రామ్ చరణ్ కొరటాలకు ఏప్రిల్‌లో కచ్చితంగా షూటింగ్‌ స్టార్ట్‌ చేద్దామని చెప్పాడట. వచ్చేనెలలో ముహూర్తం షాట్ చిత్రీకరించి ఏప్రిల్ నుండి సెట్స్ మీదకు వెళ్దాం అని అంటున్నాడట. కొరటాల ఇప్పుడు మిస్ అయితే మళ్లీ దొరకటం కష్టమని అతన్ని వెయిట్ చేయిస్తున్నాడు చరణ్. కొరటాలను బుజ్జగించి భారీ పారితోషికం కూడా ఆఫర్‌ చేసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా వేసవి సెలవుల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశముంది.

Tags:    

Similar News