క్రిష్ ఆలోచన అమలు చేస్తే..!!
ఇంతకుముందు అనుకున్న బడ్జెట్ అనుకున్నట్టుగా పెట్టడానికి ఇప్పుడు కరోనా సహకరించడం లేదు. భారీ బడ్జెట్ సినిమాల్ని బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడినది. అటు విదేశాలకు వెళ్లి [more]
ఇంతకుముందు అనుకున్న బడ్జెట్ అనుకున్నట్టుగా పెట్టడానికి ఇప్పుడు కరోనా సహకరించడం లేదు. భారీ బడ్జెట్ సినిమాల్ని బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడినది. అటు విదేశాలకు వెళ్లి [more]
ఇంతకుముందు అనుకున్న బడ్జెట్ అనుకున్నట్టుగా పెట్టడానికి ఇప్పుడు కరోనా సహకరించడం లేదు. భారీ బడ్జెట్ సినిమాల్ని బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడినది. అటు విదేశాలకు వెళ్లి షూటింగ్ చెయ్యనూ లేరు.. ఇటు ఇక్కడే భారీ సెట్స్ నిర్మాణం చెయ్యనూ లేరు. అల ఉంది ఇప్పుడు దర్శకనిర్మాతల పరిస్థితి. ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెట్టిన దర్శకనిర్మాతలు మాత్రం అపుడే బడ్జెట్ కంట్రోల్ విషయంలో తరణ భర్జనలు పది… కాస్ట్ కటింగ్ కి తెర లేపారట. ఇప్పటికే క్రిష్ పవన్ కళ్యాణ్ జానపద నేపథ్యంలో తెరకెక్కే సినిమా కోసం బడ్జెట్ కంట్రోల్ చెయ్యడానికి శతవిధాలా కృషి చేస్తున్నాడట. ఎక్కడెక్కడ బడ్జెట్ కంట్రోల్ చెయ్యొచ్చు. ఎక్కడెక్కడ కటింగ్స్ వెయ్యొచ్చు అనే దానిమీద క్రిష్ కుస్తీలు =పడుతున్నాడట
అందులో భాగంగానే క్రిష్ పవన్ కళ్యణ్ సినిమా కోసం ఐటెం సాంగ్ కానీ…. సాంగ్స్ లో భారీ సెట్స్ కానీ లేకుండా ప్లాన్స్ వేస్తున్నాడట. కథాపరంగా, యాక్షన్ సీన్స్ పరంగా క్రిష్ రాజీ పడలేనని.. డ్యూయెట్స్ లేకుండా కథానుసారం సాంగ్స్ చేద్దామని.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి చెప్పినట్లుగా టాక్. అవసరాన్ని బట్టి సినిమాలో పాటలు పెంచడం కానీ తగ్గించడం గురించి ఆలోచించాలని… అలాగే పవన్ కళ్యాణ్ గారు మధ్యలో దెబ్బేయ్యకుండా బల్క్ డేట్స్ గురించి ఆయనతో చర్చించమని కూడా క్రిష్ నిర్మాత ఏ ఏం రత్నం కి చెప్పాడట. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ గనక క్రిష్ ఆలోచనలను అమలు చేస్తే నిర్మాతపై భారం పడదు.