కృష్ణంరాజు ఇంటివద్ద పార్థివదేహం.. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కృష్ణంరాజు పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. త్రివిక్రమ్, అశ్వనీదత్, మురళీమోహన్..

Update: 2022-09-11 07:17 GMT

ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పార్థివదేహాన్ని జూబ్లిహిల్స్ లోని నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం వరకూ అక్కడే ఉంచనున్నారు. తొలుత కృష్ణంరాజు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలిస్తారని భావించారు. కానీ.. కొన్ని కారణాలచే భౌతిక కాయాన్ని ఇంటి వద్దే ఉంచనున్నారు.

కృష్ణంరాజు పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. త్రివిక్రమ్, అశ్వనీదత్, మురళీమోహన్, చిరంజీవి, మహేష్ బాబు, దిల్ రాజు, మోహన్ బాబు, రాఘవేంద్రరావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. ఆస్పత్రిలో ఉండగానే నటి అనుష్క కృష్ణంరాజు కి నివాళులు అర్పించారు. కృష్ణంరాజు భార్య.. శ్యామలాదేవి బోరున విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరితరం కావట్లేదు. కాగా.. రేపు మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్తుడని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించగా.. ఆయన ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


Tags:    

Similar News