స్టార్ హీరోలైనా... చిన్న హీరోలైన వెండితెర మీద హీరోయిన్స్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేటప్పుడు... ఆ సన్నివేశాలు పండించాలంటే... అందులో నటించకూడదు.. జీవించాలి. ఎంత పెద్ద హీరోలైనా ఇలాంటివి సినిమాల్లో కంపల్సరీ. మరి అలాంటి సన్నివేశాల్లో నటించినా.. చాలామంది హీరోలు చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే సినిమా షూటింగ్ ప్యాకప్ చెప్పెయ్యగానే చాలా కూల్ గా ఇంటికెళ్ళిపోయి.. భార్య పిల్లలతో గడుపుతుంటారు. పెళ్లికాని వాళ్ల విషయంలో ఈ లిప్ లాక్స్, బెడ్ రూమ్ సీన్స్ లాంటివేమీ తేడా కొట్టావు కానీ... పెళ్ళైన హీరోల విషయంలో అప్పుడప్పుడు ఈ నట జీవితంలోని లిప్ లాక్స్, రొమాంటిక్ సన్నివేశాలు తేడా కొడుతుంటాయి. ఇలాంటిది బాలీవుడ్ లో ఒక ఘటన జరిగింది. సినిమాలో హీరోయిన్ తో లిప్ లాక్ చేసినందుకు ఒక హీరో భార్యతో పెద్ద గొడవ పడాల్సి వచ్చిందట. మరి ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. వికీ డోనర్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా - యమి గౌతమ్ హీరోహీరోయిన్స్ గా నటించారు.
మూడేళ్లు సంసారంలో గొడవలు
ఆ సినిమా లో సందర్భానుచితంగా యామి గౌతమ్ తో లిప్‌లాక్ చేశాడు ఆయుష్మాన్. అయితే ఆ సినిమాలో ఆ లిప్ లాక్ సన్నివేశాన్ని చూసిన ఆయుష్మాన్ వైఫ్ తహీరా కశ్యప్ అప్సెట్ కావడమే కాదు... ఆయుష్మాన్ వదిలేసి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని ఆయుష్మాన్ నటి నేహా దూఫియా స్పెషల్ షోలో వెల్లడించాడు. ఇంకా ఆయుష్మాన్... మాట్లాడుతూ యామి గౌతమ్ తో వికీడోనర్ చిత్రంలో చేసిన లిప్ లోక్ తో దాదాపుగా మూడేళ్ళ పాటు చాలా ఇబ్బందులు పడ్డానని... తన భార్య తనని నమ్మడానికి చాలా సమయం పట్టిందని.. తమ కాపురం చక్కదిద్దుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందని చెప్పాడు. ఇక తర్వాత తన భార్య చాలా మారిందని.. ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ కి తన భార్య అభ్యంతరాలు చెప్పడం లేదని చెప్పాడు ఆయుష్మాన్.