చిరు గారి లాక్ డౌన్ పాఠాలు!!

లాక్ డౌన్ లో హీరోలంతా వంటలు నేర్చుకుని సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటే.. చిరు కూడా రియల్ మ్యాన్ ఛాలెంజ్ అంటూ పెసరట్టు వేసి… తల్లికి పెట్టడమే [more]

Update: 2020-05-21 06:06 GMT

లాక్ డౌన్ లో హీరోలంతా వంటలు నేర్చుకుని సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటే.. చిరు కూడా రియల్ మ్యాన్ ఛాలెంజ్ అంటూ పెసరట్టు వేసి… తల్లికి పెట్టడమే కాదు, ఇంటిని శుభ్రం చేసి మరీ ఛాలంజ్ పూర్తి చేసాడు. ఇక లాక్ డౌన్ లో చిరు ఆచార్య ముచ్చట్లను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటున్నాడు. ఇక తాజాగా తాను లాక్ డౌన్ లో షూటింగ్ లేకుండా ఖాళీగా ఉంటున్నా అని.. అందుకే తాను రోజు వారిలో చేసే పని ని సోషల్ ఇండియాలో పంచుకున్నాడు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద పెద్ట్టడమే కాదు.. దాని కోసం చిరు రోజు 40 నిమిషాల పాటు వ్యాయామాలు చేస్తున్నాడట.

అంతేకాకుండా రెండుసార్లు స్విమ్మింగ్ పూల్ లో కి వెళ్లి స్విమ్ చేస్తున్నాడట. అలాగే తనకి ఐదేళ్ల వయసులోనే వంటపై అవగాహన ఉందట. వాళ్ళ అమ్మకి వంటలో సహాయం చేసేటప్పుడు చాలా రకాల వంటలు చిరు నేర్చుకున్నాడట. అందుకే ఖాళీ సమయంలో ఉప్మా, న్యుడిల్స్, ఫ్రైడ్ రైస్ లాంటివి చేసి ఫ్యామిలీకి తినిపిస్తున్నాడట. మరి మంచి డాన్సర్, మెగాస్టార్ చిరు ఇలా చేస్తూ అందరికి ఆదర్శంగా నిలవడం చూసి మెగా ఫాన్స్ ఉబ్బి తబ్బిబ్బై పోతున్నారు.

Tags:    

Similar News