లూసిఫర్ విలన్ సెట్

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ తో బాగా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ – చిరు కాంబో సీన్స్ షూట్ లో కొరటాల రంపచోడవరం అడవుల్లో [more]

Update: 2021-02-28 08:13 GMT

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ తో బాగా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ – చిరు కాంబో సీన్స్ షూట్ లో కొరటాల రంపచోడవరం అడవుల్లో కుస్తీలు పడుతున్నారు. ఇక చిరు ఆచార్య షూటింగ్ జరుగుతుండగానే.. మోహన్ రాజ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ మొదలు పెట్టబోతున్నారు. మెగాస్టార్ చిరు లూసిఫెర్ రీమేక్ కోసం ఆచార్య షూటింగ్ కి కొద్దిపాటి బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఇక లూసిఫెర్ రీమేక్ లో మెగాస్టార్ సిస్టర్ తరహా పాత్రలో టాప్ హీరోయిన్ నయనతార కనిపించబోతుంది. టాప్ హీరోయిన్ ఇలా సిస్టర్ కేరెక్టర్ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో అనే సందేహాలకు.. గతంలో అంటే కొన్నేళ్ల క్రితం విన్నాము ఎన్టీఆర్ – సావిత్రి అద్భుతమైన కాంబినేషన్.. అదే ఎన్టీఆర్ – సావిత్రి రక్త సంబంధం అనే సినిమాలో అన్నా – చెల్లెళ్ళ కేరెక్టర్ లో నటించారు. అప్పట్లో అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అలంటి ట్రీట్ మనం చూడబోతున్నాం.
మొన్నీమధ్యనే సైరా సినిమాలో జంటగా అంటే భార్యా భర్తలుగా నటించిన మెగాస్టార్ చిరంజీవి – నయనతార ఇప్పుడు లూసిఫర్ లో అన్నా-చెల్లెళ్లుగా కనిపించబోతున్నారు. లూసిఫర్ లో చిరు, నయనతార చేసే పాత్రలు అలాంటివి. మరి నయనతార సరసన సాదా సీదా విలన్ కేరెక్టర్ కనిపిస్తే ఏం బావుంటుంది. అందుకే లూసిఫర్ రీమేక్ దర్శకుడు మోహన్ రాజా.. నయన్ భర్త అలాగే నెగెటివ్ కేరెక్టర్ కోసం చాలా ఆప్షన్స్ అలోచించి.. చాలా పేర్లు అనుకుని చివరికి చరణ్ విలన్ అరవింద్ స్వామిని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తమిళంలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తున్న తలైవిలో ఎంజీఆర్ కేరెక్టర్ లో అరవింద్ స్వామి నటిస్తున్నారు.  
ధ్రువ సినిమాలో రామ్ చరణ్ కి విలన్ గా స్టైలిష్ గా అరవింద్ స్వామి అద్భుతమైన నటనకు అందరూ ఫిదానే. మరి లూసిఫర్ లో నయన్ భర్తగా సాఫ్ట్ కొర్ విలనీ పండించాలంటే ఇలాంటి నటుడు అవసరం. అందుకే దర్శకుడు మోహన్ రాజా మళ్ళీ అరవింద్ స్వామికే మొగ్గు చూపించాడు. ఇక తనకి తని ఒరువన్ లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి అరవింద్ స్వామి కూడా లూసిఫర్ లో నయన్ భర్త కేరెక్టర్ చెయ్యడానికి సానుకూలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.

Tags:    

Similar News