సంజయ్ దత్ కి ఊపిరితిత్తుల క్యాన్సర్?
బాలీవుడ్ మీడియా మొత్తం ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం చుట్టూనే తిరుగుతుంది. గత రెండు నెలలుగా సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్యపై పోలీస్ ల శోధన [more]
బాలీవుడ్ మీడియా మొత్తం ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం చుట్టూనే తిరుగుతుంది. గత రెండు నెలలుగా సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్యపై పోలీస్ ల శోధన [more]
బాలీవుడ్ మీడియా మొత్తం ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం చుట్టూనే తిరుగుతుంది. గత రెండు నెలలుగా సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్యపై పోలీస్ ల శోధన ఎంతో కానీ…. మీడియా శోధన మాత్రం 100 శాతం ఉంది. అయితే ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం కన్నా మరో విషాదకర వార్త బాలీవుడ్ ని కమ్మేసింది. అది బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కి స్టేజ్ 4 ఊపిరి తిత్తుల క్యాన్సర్ అనే విషయాన్నీ బాలీవుడ్ జీర్నిన్చుకోలేకపోతుంది. రెండు రోజుల క్రితం సంజయ్ దత్ శ్వాస తీసుకోవడం కష్టముగా ఉండడంతో హుటాహుటిన ముంబై లోని లీలావతి హాస్పిటల్ లో జాయిన్ అయినా విషయం తెలిసిందే.
అప్పటికి సంజయ్ దత్ ఆక్సిజెన్ లెవెల్స్ 90-92 మధ్య ఉండడంతో లీలావతి హాస్పిటల్ డాక్టర్స్ సంజయ్ దత్ కి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లుగా నిర్ధారణ కాకపోయేసరికి సంజయ్ దత్ కి చాతీ భాగంలో పరీక్షలు నిర్వహించడం, అలాగే మరిన్ని పరీక్షలు చెయ్యగా సంజయ్ దత్ స్టేజ్-4 ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయినట్లుగా సమాచారం. అయితే సోమవారం సంజయ్ దత్ హాస్పిటల్ నుండి డిస్చాజ్ కాగా.. ఆయన మాట్లాడుతూ మెడికల్ చెకప్స్ కోసం, అలాగే కాస్త విశ్రాంతి కోసము సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇస్తున్నట్టుగా చెప్పాడు. అలాగే మీ ప్రేమాభిమానులతో తాను ఈ క్యాన్సర్ నుండి కోలుకుని బయటపడతాను అంటూ ఆశాభావం వ్యక్తం చేసాడు. సంజయ్ కి క్యాన్సర్ సోకడంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ లకు బ్రేకులు పడ్డాయి.