సెలబ్రిటీస్ కి నోటీసులు!!

మద్రాస్ హై కోర్టు సెలెబ్రిటీస్ కి షాకిచ్చింది. ఆన్ లైన్ లో జరిగే గ్యాంబ్లింగ్ ని ప్రోత్సహిస్తూ యాడ్స్ లో పాల్గొన్న పలువురు సెలబ్రిటీస్ కి మద్రాస్ [more]

Update: 2020-11-04 09:07 GMT

మద్రాస్ హై కోర్టు సెలెబ్రిటీస్ కి షాకిచ్చింది. ఆన్ లైన్ లో జరిగే గ్యాంబ్లింగ్ ని ప్రోత్సహిస్తూ యాడ్స్ లో పాల్గొన్న పలువురు సెలబ్రిటీస్ కి మద్రాస్ హై కోర్టు నోటిస్ లు జారీ చేసింది. ఆన్ లైన్ జూదం వలన చాలామంది ఆస్తులు పోగొట్టుకోవడమే కాదు.. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. వాటిని ఎంకరేజ్ చేస్తూ సెలబ్రిటీస్ ఆయా రకాల ఆన్ లైన్ గేమ్స్ కోసం పబ్లిసిటీ చేయడంపై కోర్టు సీరియస్ అయ్యింది.

ఈ రకమైన ఆన్ లైన్ గేమ్స్ ని ప్రోత్సహిస్తూ పబ్లిసిటీ చేసిన వారిలో క్రికెటర్స్ సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ సెలబ్రిటీస్ అయినా రానా, ప్రకాశ్ రాజ్, తమన్నా, సుదీప్ లకు మద్రాస్ హై కోర్టు నోటీసు లు జారీ చేసింది. ఆన్ లైన్ జూదాన్ని నిషేధించాలంటూ వేసిన పిల్ పై మద్రాస్ హాయ్ కోర్టు సెలెబ్రటీస్ కి నోటీసులు జారీ చేసింది. మరి జూదాన్ని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించడం అనేది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. ఇక ఆన్ లైన్ జూదాన్ని మరో పది రోజుల్లో నిషేదించాలని చెప్పింది కోర్టు. మరి ఈ నోటీసు లకు సెలబ్రిటీస్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ నెల 19 కల్లా సెలబ్రిటీస్ కోర్టు కి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని కోర్టు తెలిపింది.

Tags:    

Similar News