మహర్షి డీల్స్ క్లోజ్ చేశారు..!
మహర్షి థియేట్రికల్ బిజినెస్ ఏరియాలవారీగా పూర్తయ్యింది. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. కానీ నిన్నటివరకు ఓవర్సీస్ డీల్ మాత్రం సస్పెన్స్ గానే [more]
మహర్షి థియేట్రికల్ బిజినెస్ ఏరియాలవారీగా పూర్తయ్యింది. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. కానీ నిన్నటివరకు ఓవర్సీస్ డీల్ మాత్రం సస్పెన్స్ గానే [more]
మహర్షి థియేట్రికల్ బిజినెస్ ఏరియాలవారీగా పూర్తయ్యింది. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. కానీ నిన్నటివరకు ఓవర్సీస్ డీల్ మాత్రం సస్పెన్స్ గానే సాగింది. మహేష్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ఓవర్సీస్ లో లేకపోవడంతోనే మహర్షి సినిమాకి ఓవర్సీస్ బిజినెస్ అనుకున్నట్లుగా జరగలేదని.. అలాగే మహర్షి నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ ఎవరికి వారు వారికి నచ్చిన వారికే ఓవర్సీస్ రైట్స్ కట్టబెట్టాలని అనుకోబట్టే మహర్షి ఓవర్సీస్ బిజినెస్ సక్రమంగా జరగలేదనే టాక్ నడిచింది.
అనుకున్న ధర రాకపోయినా…
ఇక ఆంధ్రలో మహర్షి హక్కులు 39 కోట్లకు పొతే.. రీసెంట్ గా సీడెడ్ లో 12 కోట్లకి, నైజాం హక్కులు 18 కోట్లకి విక్రయించినట్లుగా తెలుస్తుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ లో ఓవర్సీస్ మార్కెట్ లో మహర్షి హక్కులు 11.5 కోట్లకు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ మీద ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఓవర్సీస్ హక్కులను గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థ కొనుగోలు చేసింది. ఓవర్సీస్ లో 12 కోట్లు వస్తాయనుకుని నిర్మాతలు ఇప్పటివరకు వెయిట్ చేసారు. కానీ డీల్ కుదరకపోయేసరికి 11.5 కోట్లకి ఇచ్చేసారు నిర్మాతలు. ఇక మహర్షి సినిమా మీద అంచనాలైతే పీక్స్ లో ఉన్నాయి. మరి ఆ అంచనాలు మహర్షి ఎంతవరకు అందుకుంటుందో మరో నెల రోజుల్లో తేలిపోతుంది.