మహర్షి అక్కడ అంత ఘోరమా..?

మహర్షి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక వంటి రాష్ట్రంలోనూ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఫస్ట్ వీకెండ్ లో హిట్ కలెక్షన్స్ [more]

;

Update: 2019-05-15 05:15 GMT
maharshi movie collections
  • whatsapp icon

మహర్షి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక వంటి రాష్ట్రంలోనూ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఫస్ట్ వీకెండ్ లో హిట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన మహర్షి సినిమా సోమవారం ఓ మోస్తరుగా కలెక్షన్స్ డ్రాపయినా… మంచి కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. ఇక్కడ హిట్ కాలక్షన్స్ తో దూసుకుపోయిన మహర్షి ఓవర్సీస్ లో మాత్రం బోల్తా కొట్టింది. ప్రీమియర్స్ నుండే మహర్షి జోరు ఓవర్సీస్ లో కనిపించలేదు. తెలుగు సినిమాలకే కాదు.. ఇండియన్ మూవీస్ అన్నింటికి ఓవర్సీస్ మార్కెట్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ఇక మహర్షి మాత్రం ఓవర్సీస్ లో బోల్తా పడింది. మహేష్ క్రేజ్ కూడా మహర్షి ని ఓవర్సీస్ లో నిలబెట్టలేకపోయింది. మరి ఇక్కడ సూపర్ హిట్ అంటూ ప్రెస్ మీట్స్ మీద ప్రెస్ మీట్స్ పెడుతూ డబ్బాలు కొడుతున్న మహర్షి సినిమా ఓవర్సీస్ లో మాత్రం డల్ అయ్యింది. ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ లో పర్వాలేదనిపించాయి మహర్షి కలెక్షన్స్. ఇక అక్కడ ప్రీమియర్స్ రోజున హాఫ్ మిలియన్ తోనే సరిపెట్టుకున్న మహర్షి ఇపుడు సినిమా విడుదలైన మొదటి సోమవారం అంటే వీక్ డే లో కొల్లగొట్టిన కలెక్షన్స్ విషయంలో టాప్ 10 మూవీస్ లో కేవలం 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.

1. రంగస్థలం – 110K
2. భారత్ అనే నేను – 80K
3. మహానటి – 66K
4. ఎఫ్2 – 65K
5. గీత గోవిందం – 50K
6. జెర్సీ – 43K
7. భాగమతి – 39K
8. గూఢచారి – 32K
9. మహర్షి – 30k
10. అరవింద సమేత – 30K

Tags:    

Similar News