మహర్షి ఓపెనింగ్స్ అదుర్స్..!

మహేష్ బాబు – పూజ హెగ్డే కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీ అయిన మహర్షి సినిమా నిన్న వరల్డ్ వైడ్ [more]

;

Update: 2019-05-10 07:41 GMT
maharshi movie collections
  • whatsapp icon

మహేష్ బాబు – పూజ హెగ్డే కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీ అయిన మహర్షి సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షోకే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న మహర్షి మూవీ మహేష్ క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మహర్షికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి కలిసి భారీగా మహర్షి సినిమాని నిర్మించారు. మహర్షికి వారు పెట్టిన ఖర్చు మొత్తం స్క్రీన్ మీద కనబడుతుంది. అయితే సినిమాలో మహేష్ బాబు నటనకు, స్టైల్ కి , సినిమాటోగ్రఫీకి, నిర్మాణ విలువలకు, కథకు మంచి పేరొచ్చినా.. సినిమాలో కామెడీ మిస్ కావడం, దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కాస్త నిరాశ‌పరచడం, నిడివి ఎక్కువ కావడం, డల్ నేరేషన్.. సినిమాలో లెక్కకు మించిన మెస్సేజ్ లు ఇవ్వడంతో ప్రేక్షకుడు ఊహించినంతగా మహర్షి లేదు అని అంతా అంటున్నారు. అయినా టాక్ తో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మహర్షి సినిమా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ మీకోసం…

ఏరియా షేర్ (కోట్లలో)

నైజాం 6.38
సీడెడ్ 2.45
నెల్లూరు 1.00
కృష్ణ 1.37
గుంటూరు 4.40
వైజాగ్ 2.88
ఈస్ట్ గోదావరి 3.20
వెస్ట్ గోదావరి 2.46
ఏపీ, టీఎస్ షేర్ 24.14 కోట్లు

Tags:    

Similar News