మహేష్ కి చిరుపై ఉన్న గౌరవం అదే!

హైదరాబాద్ లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన సినీ మహోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం [more]

Update: 2019-09-09 11:21 GMT

హైదరాబాద్ లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన సినీ మహోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు మహేష్ ఫ్యాన్స్ కి కన్నుల పండుగలా కనిపించింది. వీరిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్న ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మహేష్ కు చిరు ఎంత గౌరవమో మరోసారి రుజువైంది.

 

చిరుతో మాట్లాడితే కొత్త ఎనర్జీ వచ్చింది

ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ..ముందుగా చిరు గురించి మాట్లాడడం మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. చిరంజీవి గారితో మాట్లాడుతుంటే ఒక రకమైన కొత్త ఎనర్జీ వస్తుందని మరోసారి ఈ సందర్భంగా దాన్ని ఆస్వాదించానని చెప్పడం..అలానే సైరా టీజర్ చూశానని, మైండ్ బ్లోయింగ్ గా ఉందని, విజువల్ వండర్ ని అందరితో పాటు తనకూ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఉందని చెప్పడంతో అక్కడ మెగా ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగిపోయారు. మహేష్ చిరు గురించి మాట్లాడుతున్న వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది.

 

.

Tags:    

Similar News