దిల్ రాజే కావాలట..!

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా మహర్షి సినిమా చెయ్యాల్సింది. కేవలం దిల్ రాజు సోలోగా మహేష్ సినిమాని నిర్మించాల్సి ఉంది [more]

Update: 2019-05-16 06:58 GMT

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా మహర్షి సినిమా చెయ్యాల్సింది. కేవలం దిల్ రాజు సోలోగా మహేష్ సినిమాని నిర్మించాల్సి ఉంది కానీ అనుకోకుండా సినిమా మొదలయ్యే నాటికి మరో ఇద్దరు నిర్మాతలైన అశ్వినీదత్, పివిపి కూడా ఆ సినిమాలో భాగస్వాములయ్యారు. అయితే మొదటి నుండి దిల్ రాజు మహర్షి సినిమా నిర్మాణ పనులు, ఆ బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను చాలా చాకచక్యంగా పూర్తి చేసాడు. మరోపక్క మహర్షి ప్రమోషన్స్ లోనూ దిల్ రాజు తనదైన ముద్ర వేసాడు. మిగతా ఇద్దరు నిర్మాతలు కేవలం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, సక్సెస్ మీట్ లో హడావిడి చేసినా… మిగతా విషయాల్లో దిల్ రాజు హడావిడే ఎక్కువ. బిజినెస్ విషయాల్లోనూ చాలా సమస్యలను దిల్ రాజు సింగల్ హ్యాండ్ తో మేనేజ్ చేసాడట. అలాగే మహర్షికి ఎదురైన సమస్యలను దిల్ రాజు ముందుండి సాల్వ్ చేసాడట. ఇక ఈ విషయమై మహేష్ కూడా దిల్ రాజును పొగిడేసాడు. దిల్ రాజు ప‌ట్ల‌ మహర్షి విషయంలో మహేష్ బాగా ఇంప్రెస్స్ అయ్యాడట. అందుకే మరోసారి దిల్ రాజు తన సినిమా నిర్మించాలని కొరుకుంటున్నాడట. తాజాగా మహేష్.. అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడు.

దిల్ రాజునే నిర్మించాలంటున్న మ‌హేష్

అయితే మొదట్లో అనిల్ – మహేష్ సినిమాని దిల్ రాజు బ్యానేర్ లోనే చెయ్యాలని దిల్ రాజు డిసైడ్ అయ్యాడు. కానీ కొన్ని కారణాల చేత దిల్ రాజు ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని న్యూస్ నడిచింది. అయితే మహేష్ మాత్రం దిల్ రాజుని నిర్మాతగా ఉండమని అడుగుతున్నాడట. మిమ్మల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు.. క‌చ్చితంగా మీరు ఈ సినిమాకి పనిచేయాలని పట్టుబడుతున్నాడట. మరి మహేష్ ఒకరిని నమ్మితే ఎంతలా ఆ రిలేషన్ షిప్ ని కాపాడుకుంటాడో మనం పీఆర్వో బీఏ రాజు విషయంలో చూస్తున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ పీఆర్వో అయిన బిఎ రాజు ప్రస్తుతం మహేష్ సినిమాలకు తప్ప మరే హీరోల సినిమాలకు పీఆర్వో గా పనిచెయ్యడం లేదు. ఎందుకంటే చాలామంది యంగ్ పిఆర్వోస్ బిఎ రాజుకి ఎసరు పెట్టేస్తున్నారు. ఇక మహేష్ సినిమాలకు పీఆర్వో చెయ్యడానికి చాలామంది ట్రై చేసున్నా.. మహేష్ మాత్రం బిఎ రాజుని తప్ప మరెవరినీ తీసుకోడు. బిఎ రాజు అంటే అంత ప్రత్యేకమైన అభిమానం మహేష్ కి. మరి ఇదే అభిమానాన్ని మహేష్ ఇప్పుడు దిల్ రాజు మీద చూపిస్తున్నట్లుగా కనబడుతుంది.

Tags:    

Similar News