మహేష్ నెక్స్ట్ ఎవరితో

మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీ తరువాత మహేష్ ఏ సినిమా చేయాలన్న దానిపై [more]

Update: 2019-10-21 08:21 GMT

మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీ తరువాత మహేష్ ఏ సినిమా చేయాలన్న దానిపై డైలమాలో పడ్డారు. దీని తరువాత వంశీపైడిపల్లి – దిల్ రాజు ప్రాజెక్టు అని అంతా అనుకుంటున్నారు. మహేష్ కూడా వంశీ చెప్పిన కథ కు ఇంప్రెస్స్ అయ్యి చేద్దాం అనడంతో వంశీ దానిపై వర్క్ చేసాడు.

ఏది ముందు…?

ఈ గ్యాప్ లో కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ కథ చెప్పాడట. ఇది కూడా మహేష్ కి నచ్చడంతో ఏది చేయాలి అని ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రస్తుతం కేజిఎఫ్ 2 ప్రాజెక్టుతో బిజీగా వున్న ప్రశాంత్ నీల్ ఫ్రీ కావడానికి, కొత్త స్క్రిప్ట్ రెడీ చేయడానికి టైమ్ పడుతుంది. వంశీ కూడా కథ రెడీ చేయడానికి ఇంకా సమయం పడుతుంది. ఇద్దరిలో ఎవరిది ముందు అయితే ఆ డైరెక్టర్ తో చేయాలనీ ఫైనల్ గా డిసైడ్ అయ్యాడు మహేష్. ఏ డైరెక్టర్ తో అని మరో రెండుమూడు నెలల్లో క్లారిటీ వచ్చేసింది.

 

 

Tags:    

Similar News