మహేష్ కి దిల్ రాజు షాక్..!

దిల్ రాజుకి ఎప్పటి నుండో మహేష్ తో సోలో సినిమా చెయ్యాలని ఉండేది. అందుకే దిల్ రాజు నిర్మాతగా మహర్షి సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సెట్ [more]

Update: 2019-04-05 10:49 GMT

దిల్ రాజుకి ఎప్పటి నుండో మహేష్ తో సోలో సినిమా చెయ్యాలని ఉండేది. అందుకే దిల్ రాజు నిర్మాతగా మహర్షి సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సెట్ చేసుకున్నాడు. కానీ మధ్యలో అశ్వినీదత్, పీవీపీ ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యులయ్యారు. అలా దిల్ రాజు మహేష్ సినిమాని సోలోగా నిర్మించాలనే కల కలగానే మిగిలిపోయింది. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు మహేష్ తో సినిమా కమిట్ చేయించాడు. ఇక్కడైనా దిల్ రాజు సోలోగా ప్రాజెక్ట్ చేద్దామంటే మహేష్.. అనిల్ సుంకరిని తెచ్చి దిల్ రాజుకి తగిలించాడు. అలా దిల్ రాజు మళ్లీ పార్ట్ నర్ ని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

తప్పుకున్న దిల్ రాజు

ఇక అనిల్ రావిపూడితో దిల్ రాజు – అనిల్ సుంకర కలిసి మహేష్ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాకి మహేష్ 50 కోట్ల పారితోషకం అందుకుంటుండగా… దర్శకుడు అనిల్ రావిపూడి కూడా 12 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడనే ప్రచారం జరిగింది. మరి దిల్ రాజు – అనిల్ సుంకర మహేష్ సినిమా మీద భారీగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా జూన్ నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉందనే టాక్ మొదలైన క్షణంలో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. దిల్ రాజు ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడో కారణాలు తెలియరాలేదు. కానీ ప్రస్తుతం అనిల్ రావిపూడి – మహేష్ కాంబో నిర్మాణ వ్యవహారాలు అనిల్ సుంకర చూసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి

Tags:    

Similar News