రాజమౌళి కన్నా ముందు మహేష్ మరో ప్రాజెక్ట్?
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో దుబాయ్ లో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ సినిమాని వీలైనంత త్వరగా [more]
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో దుబాయ్ లో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ సినిమాని వీలైనంత త్వరగా [more]
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో దుబాయ్ లో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా అవుట్ ఫుట్ విషయంలో కూడా చాలా హ్యాపీ గా వున్నాడు. అలాగే రాజమౌళి తో మహేష్ ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నాడు. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి తో నెక్స్ట్ సినిమా చెయ్యాల్సింది మహేషే కాబట్టి. అయితే ఆర్.ఆర్.ఆర్ కంప్లీట్ అవ్వడానికి, మహేష్ తో సినిమా మొదలు పెట్టడానికి మధ్య రాజమౌళి చిన్నపాటి విరామం అంటే కాస్త విశ్రాంతి కోరుకుంటున్నాడట.
అయితే ఆ విరామంలో మహేష్ సర్కారు వారి పాట పూర్తి చేసేసి.. మరో సినిమా చేసుకునే ఛాన్స్ దొరికింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ అయ్యి.. మహేష్ తో నేను రెడీ అని రాజమౌళి చెప్పే లోపు మహేష్ బాబు ఇంకో సినిమా కంప్లీట్ చేసుకోవచ్చు. మహేష్ కూడా అదే ప్లాన్ లో ఉన్నాడు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ నెక్స్ట్ ఇమ్మిడియట్ గా మరో సినిమా చెయ్యబోతున్నాడు. త్వరలోనే ఆ డిటైల్స్ కూడా..