మరో ఇద్దరినీ లైన్ లో పెట్టాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో ఓ [more]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో ఓ [more]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ సుక్కు ఇంతవరకు సరైన స్టోరీ చెప్పకపోవడంతో రిజెక్ట్ చేసేసాడు. ఇక ఈ మధ్యలో అనిల్ రావిపూడి మహేష్ కు ఓ స్టోరీ వినిపించి ఓకే చేయించుకున్నాడు. అయితే అనిల్ కూడా ఇంతవరకు మహేశ్ బాబుకి పూర్తి స్క్రిప్ట్ చెప్పలేదట. అనిల్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకుని మహేష్ కి చెప్పిన తరువాత ఆయనకు నచ్చకపోతే మళ్లీ కథ మొదటికి వస్తుంది.. తదుపరి ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుంది.
అనిల్ సినిమా లేట్ అయితే…
అందుకే మహేష్ మరో ఆలోచన చేస్తునట్టు సమాచారం. అనిల్ లో సినిమా ఎక్కడ లేట్ అవుతుందో అని మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెడుతున్నాడట. అనిల్ చెప్పిన కథ ఏమాత్రం తేడా వచ్చినా…మరో దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఆ దర్శకులు ఎవరు అనేది మాత్రం మహేష్ టీం చాలా గోప్యంగా ఉంచుతుంది.