అనిల్ రావిపూడి దారిలో పరశురామ్

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట కరోనా గనక లేకపోతే ఈపాటికి అమెరికా షెడ్యూల్ షూట్ లో బిజీగా ఉండేది. కానీ [more]

Update: 2020-12-27 15:32 GMT

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట కరోనా గనక లేకపోతే ఈపాటికి అమెరికా షెడ్యూల్ షూట్ లో బిజీగా ఉండేది. కానీ కరోనా వలన అమెరికా షూటింగ్ క్యాన్సిల్ అయినా.. కొత్త సంవత్సరంలో మహేష్ సర్కారు వారి పాట సెట్స్ మీదకెళ్లబోతుంది. హైదరాబాద్ లోనే సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఆ బ్యాంకు సెట్ వగైరా అన్ని సిద్ధం చేస్తున్న పరశురామ్ ఇప్పుడు కామెడీ డైరెక్టర్ అనిల్ అవిపూడిని ఫాలో అవుతానంటున్నాడట.

పరశురామ్ ఫాలో అయ్యేది అనిల్ రావిపూడి యాక్షన్ లో అట. అంటే అనిల్ రావిపూడి గొప్ప యాక్షన్ డైరెక్టర్ అని కాదు.. అనిల్ రావిపూడి గతంలో తెరకెక్కించిన సుప్రీం సినిమాలోని ఓ ఫైట్ మీద పరశురామ్ కన్ను పడిందట. సుప్రీం సినిమాలో సాయి ధరమ్ తేజ్ కోసం దివ్యంగుల ఫైట్ పెట్టాడు అనిల్. ఆ దివ్యంగుల ఫైట్ సుప్రీం లో బాగా హైలెట్ అయ్యింది. ఇప్పుడు పరశురామ్ కూడా మహేష్ సర్కారు వారి పాటలో అలాంటి ఫైట్ ఒకటి డిజైన్ చేయబోతున్నాడట. దివ్యాంగుల నేప‌థ్యంలో ఓ ఫైట్ ఈ సినిమాకి హైలెట్ అవుతుంద‌ని స‌మాచారం. ఓ దివ్యానంగుడి కోసం హీరో చేసే ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందట. ఈ సన్నివేశలే మహేష్ ని సర్కారు వారి పాట ఒప్పుకునేలా చేశాయని.. ఈ ఫైట్ సినిమాల్లో ఓ హైలెట్ గా నిలవడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News