వెంకిమామ టెన్షన్ లో బన్నీ, మహేష్ లు

వచ్చే సంక్రాంతికి గట్టి పోటీ ఉండేటట్టు ఉంది. సంక్రాంతి కి ఏమేమి సినిమాలు వస్తున్నాయో నిన్నటితో అర్ధం అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, [more]

Update: 2019-10-13 07:21 GMT

వచ్చే సంక్రాంతికి గట్టి పోటీ ఉండేటట్టు ఉంది. సంక్రాంతి కి ఏమేమి సినిమాలు వస్తున్నాయో నిన్నటితో అర్ధం అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించాయి. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా జనవరి 12 న రిలీజ్ అవుతున్నాయి.

ఇక ఈ రేస్ లో కళ్యాణ్ రామ్ ఎంత‌మంచివాడ‌వురా కూడా ఉండనుందని టీజర్ లో హింట్ ఇచ్చారు. అలానే తమిళ చిత్రం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మూవీ ద‌ర్బార్ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. ఈసినిమాలకి పోటీగా వెంకటేష్ అండ్ నాగ చైతన్య కూడా రానున్నారు. వెంకిమామ చిత్రం కూడా సంక్రాంతికి కంఫర్మ్ అయినట్టు అర్ధం అవుతుంది.

ఈ ఏడాది స్టార్టింగ్ లో ఎఫ్ 2 చిత్రంతో హిట్ అందుకున్న వెంకీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని వెంకిమామ ని రిలీజ్ చేస్తున్నాడు. అసలే ఈమూవీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు. ఆయనకు థియేటర్స్ కొరత కూడా లేదు. సో అందుకని సంక్రాంతి కి ఎంత పోటీ ఉన్న వెంకటేష్ అండ్ చైతు వస్తున్నారు. కాకపోతే ఈ రేస్ లో కళ్యాణ్ రామ్ కి రజినీకాంత్ కి థియేటర్స్ దొరకడమే కష్టం అవుతుంది.

Tags:    

Similar News