సరిలేరు నీకెవ్వరూకి చుక్కలు చూపించడానికి రెడీ

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి..మహర్షి తో సాలిడ్ హిట్ కొట్టిన మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాని తట్టుకోవాలి [more]

Update: 2019-10-20 03:53 GMT

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి..మహర్షి తో సాలిడ్ హిట్ కొట్టిన మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాని తట్టుకోవాలి అంటే… ఎంత స్ట్రాటజీ, ఎంత నేర్పు, ఎలాంటి ప్రమోషన్స్ ఉండాలి. అసలే నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ తో ఉన్న అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా. ఆ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉండాలి. అందుకే త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ లు పక్కా ప్రమోషన్స్ ని, పక్కా స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అందుకే 25 లక్షలు ఖర్చు పెట్టిమరీ అదిరిపోయే ప్రమోషన్ సాంగ్ ని థమన్ తో, సిద్ తో కలిపి వదిలారు. ఆ సాంగ్ ఇప్పటివరకు తెలుగు పాటలు సాధించలేని వ్యూస్ తో యూట్యూబ్ లో రచ్చ చేస్తుంది.

ఒకేఒక్క పాటతో సరిలేరు కి చుక్కలు చూపించిన అలా వైకుంపురములో టీం ఇప్పుడు మరో మాస్ బీట్ ని ప్రత్యేకంగా వదలడానికి రెడీ అయ్యింది. ఈ మాస్ సాంగ్ ని దీపావళి కానుకగా విడుదల చేయబోతుంది. ఈ సాంగ్ కి కూడా భారీ ఖర్చుతో ప్రమోట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి అల వైకుంఠాన్ని ఎదుర్కోవడానికి సరిలేరు నీకెవ్వరూ సినిమా పోస్టర్స్ అయినా, టీజర్ అయినా రెడీ అవుతుందో లేదో కానీ… అలా టీం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సంక్రాంతికి ఫుల్ మీల్స్ సినిమాగా అలా వైకుంఠపారములో సినిమాని త్రివిక్రమ్ తీర్చి దిద్దుతున్నాడు. అల్లు అర్జున్ స్టయిల్, త్రివిక్రమ్ మ్యానరిజం, పంచ్ డైలాగ్స్ ముందు సరిలేరు నీకెవ్వరూ కి ఎలాంటి ప్రమోషన్స్ చేస్తే క్రేజ్ వస్తుందో చూడాలి. మరి అలా స్పీడు మీదుంటే.. సరిలేరు మాత్రం సైలెంట్ గా ఉంది.

Tags:    

Similar News