సరిలేరు నీకెవ్వరూ కామెడీగా.. యాక్షన్ చేసేసారు

మహేష్ బాబు – చిరంజీవి – విజయశాంతి ముగ్గరు ఒకే స్టేజ్ మీద.. అబ్బా చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఇంకా . రష్మిక అల్లరి క్యూట్ [more]

Update: 2020-01-06 05:40 GMT

మహేష్ బాబు – చిరంజీవి – విజయశాంతి ముగ్గరు ఒకే స్టేజ్ మీద.. అబ్బా చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఇంకా . రష్మిక అల్లరి క్యూట్ డాన్స్, సంగీత, తమన్నా డాంగ్ డాంగ్ డాన్స్ పెరఫార్మెన్స్ అబ్బో సరిలేరూ నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి అంతా ఇంతా కాదు. దేవిశ్రీ పెరఫార్మెన్స్ తో స్టేజ్ దద్దరిల్లుతుంటే.. మధ్యలో సరిలేరూ నీకెవ్వరూ ట్రైలర్ హంగామా..మరి సరిలేరూ నీకెవ్వరూ ట్రైలర్ మొత్తం అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, మహేష్ మార్క్ యాక్షన్ కలగలిపిన కంటెంట్ తో కట్ చేసారు. మొదటినుండి సరిలేరూ నీకెవ్వరూ ట్రైన్ ఎపిసోడ్ అబ్బో అంటూ ఊదరగొడుతున్నట్లే.. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ తో ట్రైలర్ స్టార్ట్ చేసారు.

రష్మిక ఎంతో చిలిపిగా క్యూట్ గా అందంగా ఉన్న అబ్బాయి ట్రైన్ జర్నీలో తగలాలనీ దేవుణ్ణి కోరుకొగానే మహేష్ కనిపించడం మనసు పారేసుకోవడం, మహేష్ ని ప్రేమించెయ్యడం, ఇంకా బండ్ల గణేష్ బ్యాచ్ కామెడీ, రష్మిక, సంగీత, హరితేజ హంగామా, మహేష్, రాజేంద్రప్రసాద్ కూడా కోరస్ గా కామెడీ చెయ్యడంతో.. ట్రైలర్ ఫస్ట్ హాఫ్ అలా అలా కామెడీగా పూర్తవుతుంది. ఇక ట్రైలర్ సెకండ్ హాఫ్ లో మహేష్ యాక్షన్ స్టార్ట్ చేసాడు. విజయశాంతి సిన్సియర్ ఆఫీసర్ గా 15 ఏళ్ళ కెరీర్ లో తప్పుని రైట్ అంటూ సంతకం పెట్టదు.. ఇక ప్రకాష్ రాజేమో తప్పులే పనిగా పెట్టుకుంటాడు. అంటే తప్పుని రైట్ గా మార్చేదాకా ఊరుకునే రకం కాదు. ఇక మహేష్, విజయశాంతి బాడీ గార్డ్ లెక్క… ఆమె ఎక్కడికెళ్లినా ఆమె వెన్నంటే ఉండడమే కాదు…. ప్రకాష్ రాజ్ కి వార్నింగ్ లాంటివి ఇస్తుంటాడు. ఇక ట్రైలర్ చివర్లో.. చిన్న బ్రేక్ ఇస్తున్నాను తర్వాత బొమ్మ దద్దరిల్లి పోద్ది అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ మాత్రం సంక్రాతి సినిమాలకి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది

Tags:    

Similar News