సుకుమార్ – మహేష్ సినిమా ఆప్ డేట్..!

మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి [more]

Update: 2019-02-18 06:12 GMT

మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా లేదు. సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియడం లేదు. ఈ నేపధ్యంలో రూమర్స్ బాగా వస్తున్నాయి. సుకుమార్ సినిమా కన్నా ముందు మహేష్ మరో సినిమా చేస్తున్నాడని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఎఫ్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్ మహేష్ ఓ సినిమా చేస్తున్నాడని.. ఆల్రెడీ స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయిందని.. 6 నెలల్లో సినిమా కంప్లీట్ చేస్తానని అనిల్ మాట ఇచ్చాడని అందుకే మహేష్ అనిల్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

విహార యాత్ర తర్వాతే…

అయితే సుకుమార్ టీం నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త అబద్ధమేనట. అనిల్ మహేష్ ని కలిసిన మాట నిజమే అవ్వొచ్చు.. వీరి కాంబినేషన్ లో సినిమా ఓకే అవ్వవచ్చు కానీ సుకుమార్ చిత్రం కంటే ముందు కాదని అది ప్రచారం మాత్రమే అని అంటున్నారు. మహేష్ ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. ఆ టైంకి తన పిల్లలకు స్కూల్ పూర్తవుతుంది. వెంటనే నెల రోజుల పాటు కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్తాడట. వెళ్లి వచ్చాక సుకుమార్ సినిమా స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News