మహెష్ కన్ఫర్మ్ చేసాడుగా..!

మహేష్ – సుకుమార్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చేసిన సుకుమార్ తన నెక్స్ట్ ఫిలిం మహేష్ కి చేస్తాడని అధికారికంగానే [more]

Update: 2019-03-05 07:59 GMT

మహేష్ – సుకుమార్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చేసిన సుకుమార్ తన నెక్స్ట్ ఫిలిం మహేష్ కి చేస్తాడని అధికారికంగానే వినబడింది. నిజంగానే నిన్నటివరకు మహర్షి తర్వాత మహేష్, సుకుమార్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడని.. సుకుమార్ గతంలో చెప్పిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ.. సుకుమార్ ఫ్రెష్ స్టోరీతో మహేష్ ని ఇంప్రెస్స్ చేసాడని.. మహర్షి తర్వాత సుకుమార్ తోనే మహేష్ మూవీ అని అన్నారు. ఇక సుకుమార్ తర్వాత అనిల్ రావిపూడి మహేష్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కూడా ప్రచారంలోకొచ్చింది. అయితే తాజాగా సుకుమార్ తో అల్లు అర్జున్ 20వ సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చేసేసరికి మహేష్ – సుకుమార్ సినిమాపై అందరిలో అనుమానాలు మొదలైనాయి.

ట్వీట్ చేసిన మహేష్ బాబు

మహేష్ – సుకుమార్ పై వచ్చిన వార్తలు కేవలం గాసిప్స్ గా నిలిచిపోతాయి. మహేష్ తన ట్విట్టర్ ద్వారా… సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోకి ఆల్ ది బెస్ట్ చెప్పేసాడు. సుకుమార్ కి కంగ్రాట్స్ చెప్పడమే కాదు… తనకు, సుకుమార్ కి మధ్య క్రియేటివ్ డిఫ్రెన్సెస్ ఉన్నాయని.. అయన మైండ్ సెట్ కి తన మైండ్ సెట్ కి తేడా ఉందని చెప్పిన మహెష్.. సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక సుకుమార్ సినిమాలను, ఆయన క్రియేటివిటీని తాను గౌరవిస్తాని.. అలాగే సుకుమార్ డైరెక్షన్ లో చేసిన వన్ నేనొక్కడే సినిమా వర్క్ విషయంలో ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేసానని మహేష్ ట్వీట్ చేసాడు. మహేష్ స్పందనతో సుకుమార్, మహేష్ కాంబోకి ఫైనల్ గా తెరపడిపోయింది.

Tags:    

Similar News