మహేష్ అలా కనబడతాడా?

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మరో మూవీ తో రంగంలోకి దిగడానికి ఏడాది టైం పట్టేలాగే కనబడునది. ఎందుకంటే సరిలేరు తర్వాత మహేష్ బాబు [more]

Update: 2020-09-05 06:55 GMT

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మరో మూవీ తో రంగంలోకి దిగడానికి ఏడాది టైం పట్టేలాగే కనబడునది. ఎందుకంటే సరిలేరు తర్వాత మహేష్ బాబు ఐదు నెలల గ్యాప్ తీసుకుని కొత్త సినిమా సర్కారు వారి పాటను ప్రకటించాడు. ఇక సర్కారు వారి పాట సెట్స్ మీదికెళ్లడానికి ఆదినుండి కరోనా అడ్డంకులే. అయితే మహేష్ సర్కారు వారి పాట నవంబర్ నుండి అయినా లేదంటే డిసెంబర్ మొదటి వారం నుండి అయినా సెట్స్ మీదకెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇకపోతే సర్కారు వారిపాట సినిమా కథ విషయంలో మొదటినుండి బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిస్తూ హీరో బ్యాంక్ సమస్యలపై పోరాటమే ఈ సినిమా కథ అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే కొత్తగా మహేష్ బాబు ఈ సినిమాలో రెండు పాత్రల్లో అంటే ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది.ఒక పాత్రలో బ్యాంకు ఆఫీసర్ కొడుకుగా, రెండో పాత్రలో పాన్ బ్రోకర్ గా మహేష్ కనిపించబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హక్చర్ చేస్తుంది. మహేష్ చెయ్యబోయే ఈ పాన్ బ్రోకర్ పాత్ర పోకిరిలో మహేష్ పాత్రని పోలి ఉంటుంది అని టాక్. మరి ఇందులో నిజమెంతుందో కానీ.. మహేష్ ద్విపాత్రాభినయం పై వస్తున్న వార్తలతో మహేష్ ఫాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో మొదటిసారిగా కీర్తి సురేష్ మహేష్ కి జోడి కడుతుంది.

Tags:    

Similar News