మహేష్ ఎందుకంత అందంగా ఉంటాడో అంటున్న ఫిదా బ్యూటీ!

మహేష్ బాబు 40 ఏళ్ళ వయసులోనూ 20 ఏళ్ళ కుర్రాడిలా ఫిట్ గాను, లుక్స్ పరంగా అందంగానూ ఉంటాడు. ఇపప్టికి అమ్మాయిల కంటిమీద కుంటరానివ్వని మహేష్  అమ్మాయిల [more]

Update: 2020-12-17 08:54 GMT

మహేష్ బాబు 40 ఏళ్ళ వయసులోనూ 20 ఏళ్ళ కుర్రాడిలా ఫిట్ గాను, లుక్స్ పరంగా అందంగానూ ఉంటాడు. ఇపప్టికి అమ్మాయిల కంటిమీద కుంటరానివ్వని మహేష్ అమ్మాయిల కలల రాకుమారుడు.. అందరు హీరోయిన్స్ కి అందని ద్రాక్ష మహేష్. అయితే మహేష్ లుక్ కి, ఆయన అందానికి పడని అమ్మాయిలు ఉండరు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ మహేష్ లుక్ కి పడిపోయిందట. మరి ఆ హీరోయిన్ కూడా అల్లాటప్పా హీరోయిన్ కాదు.. అలాగే మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేయాలని చూసే హీరోయిన్ అంతకంటే కాదు. ఆమె రౌడీ బేబీ సాయి పల్లవి. మహేష్ పక్కన సాయి పల్లవికి ఎప్పుడో అవకాశం వచ్చింది. ముద్దు సన్నివేశాల వలన మహేష్ సినిమానే రిజెక్ట్ చేసిన టాలంటేడ్ హీరోయిన్ సాయి పల్లవి.

మహేష్ అవకాశం వదిలేసిన సాయి పల్లవి ఏం ఫీలవడం లేదు కానీ.. మహేష్ లుక్ కి మాత్రం ఫిదా అంటుంది. మహేష్ అందానికి తాను ఎంతగా ఫిదా అవుతానో చెప్పలేనంటుంది. మహేష్ చాలా అందంగా హ్యాండ్ సమ్ గా ఉంటాడని..మహేష్ స్కిన్ ఎప్పుడూ మెరిసిపోతుంది అంటూ చెప్పడమే కాదు.. ఈ బ్యూటీ మహేష్ ఫొటోస్ ని చూస్తున్నప్పుడు జూమ్ చేసి మరీ చూస్తుందట.. ఎందుకంటే మహేష్ ఫేస్ మీద చిన్న మచ్చయినా పట్టుకుందామని. కానీ మహేష్ మొహంపై చిన్న మచ్చ కూడా కనిపెట్టలేమంటుంది. అసలు ఒక మనిషి ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఉంటాడో అంటూ తెగ షాకైపోతుంది సాయి పల్లవి. మహేష్ లేటెస్ట్ హ్యాండ్ సమ్ లుక్స్ ఈమధ్యన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిసిందే.

Tags:    

Similar News