డైరెక్టర్ ని టెన్షన్ పెడుతున్న మహేష్..?

మహేష్ బాబు ఇదివరకటిలా గుడ్డిగా సినిమాలు ఒప్పేసుకుని చెయ్యడం లేదు. కేవలం స్టోరీ లైన్ విని సినిమా ఒప్పుకోవడం కాకుండా పూర్తి స్క్రిప్ట్ విన్నాక కథ నచ్చాకే [more]

Update: 2019-03-02 06:27 GMT

మహేష్ బాబు ఇదివరకటిలా గుడ్డిగా సినిమాలు ఒప్పేసుకుని చెయ్యడం లేదు. కేవలం స్టోరీ లైన్ విని సినిమా ఒప్పుకోవడం కాకుండా పూర్తి స్క్రిప్ట్ విన్నాక కథ నచ్చాకే రంగంలోకి దిగుతున్నాడు. గత ఏడాది వంశీ పైడిపల్లి తన కోసం ఏడాదిన్నర వెయిట్ చేసి మరీ పూర్తి స్క్రిప్ట్ తోనే మహర్షి సినిమాని పట్టాలెక్కించాడు. తాజాగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాకి కూడా మహేష్ నో చెప్పాడనే టాక్ నడుస్తుంది. అలాగే సుకుమార్ కథ మీద కూడా మహేష్ సంతృప్తిగా లేడని అంటున్నారు. ఇక తాజాగా మహర్షి సినిమా షూటింగ్ కంప్లీట్ కాక సినిమా ఏప్రిల్ 25 నుండి వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగింది. ఇంతకుముందే ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 25కి వాయిదా పడింది. మళ్లీ వాయిదా అంటే ఎక్కడ నెగెటివ్ ఇంప్రెషన్ పడుతుందో అని భయపడిన మహేష్ నిర్మాత దిల్ రాజుతో గబాగబా సినిమా ఏప్రిల్ 25 కే వస్తున్నట్టుగా అధికారిక ప్రకటన ఇప్పించాడు.

షూటింగ్ పూర్తి కాకపోవడంతో…

కట్ చేస్తే మహర్షి షూటింగ్ ఇంకా కొలిక్కి రాలేదట. ఇంకా కొంత మొత్తం షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోవడంతో.. ఇప్పుడు మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లికి టెన్షన్ పట్టుకుందట. వంశీ పైడిపల్లి కొని సీన్స్ ని రీషూట్ చెయ్యడం, అలాగే షూటింగ్ ని పరిగెత్తించకుండా నెమ్మదిగా సాగదీయడంతోనే ఇలా మహర్షి షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చిందట. ఇప్పుడేమో మహేష్ మహర్షి విడుదల డేట్ ఇప్పించెయ్యడంతో వంశీ పైడిపల్లి కంగారు పడుతున్నటున్నాడట. మరి షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రోడక్షన్ తో పాటు సినిమా పబ్లిసిటీని ఓ రేంజ్ లో చెయ్యాలనుకుంటే.. ఇప్పుడు ఈ కంగారులో ఏదైనా తేడా కొడుతుందేమో అని వంశీ టెన్షన్ పడుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. మరి స్టార్ హీరోతో సినిమా అంటే.. ఆ హీరో గారి ఫ్యాన్స్ నుండి కూడా ఒత్తిడి ఉంటుంది. ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా వంశీని త్వరగా సినిమాని పూర్తి చేసి విడుదల చెయ్యమని ఒత్తిడి పెంచుతున్నారట.

Tags:    

Similar News