మహేష్ నెక్స్ట్ సుకుమార్ తో కాదా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుని కొంత గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ [more]

Update: 2018-12-29 07:05 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుని కొంత గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దిల్ రాజు, పీవీపీ, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టనున్నాడు.

ఎన్ని స్టోరీలు చెప్పినా….

‘మహర్షి’ తరువాత మహేష్ సుకుమార్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసాడు. మైత్రి సంస్థ ఈచిత్రం ను నిర్మిస్తుంది. జనవరి లో సినిమా ఓపెనింగ్ చేసి మే నుండి సెట్స్ మీదకు తీసుకుని వెళ్లాలని మహేష్ భావించాడు. అయితే ఇంతవరకు స్క్రిప్ట్ ఫైనలైజ్ అవ్వలేదు. మహేష్ కు సుకుమార్ చాలా స్టోరీస్ చెప్పినా అవేమీ మహేశ్ బాబుకి నచ్చట్లేదట. మరో కథను రెడీ చేసుకుని రమ్మని మహేష్ సుకుమార్ కి చెప్పాడట.

ఆయనతోనేనా…?

మరో కథ రెడీ చేయడానికి నాకు కొంత సమయం కావాలని సుకుమార్ మహేష్ ని కోరాడట. దాంతో ఈ గ్యాప్ లో మహేశ్ బాబు మరో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆ దర్శకుడు ఎవరో మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ మొత్తం వారి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ – అల్లు అర్జున్, చిరంజీవి తో…బోయపాటి – బాలకృష్ణ తో… కొరటాల – చిరు, రామ్ చరణ్ ల తో బిజీగా వున్నారు. మరో పక్క సందీప్ వంగా తో చేసే అవకాశం ఉందని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి. ప్రస్తుతం ఫామిలీ తో హాలిడే లో ఉన్న మహేష్ నుండి తిరిగి రాగానే ‘మహర్షి’ నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు.

Tags:    

Similar News