‘మజిలీ’ తో ఆ లోటు తీరిపోయింది
సోలో హీరోగా తను సాధించాలనుకున్న ఓ ఫీట్ ‘మజిలీ’ సినిమాతో సాధించాడు నాగ చైతన్య. ఈసినిమాతో 30 కోట్లు చేసి రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు. [more]
సోలో హీరోగా తను సాధించాలనుకున్న ఓ ఫీట్ ‘మజిలీ’ సినిమాతో సాధించాడు నాగ చైతన్య. ఈసినిమాతో 30 కోట్లు చేసి రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు. [more]
సోలో హీరోగా తను సాధించాలనుకున్న ఓ ఫీట్ ‘మజిలీ’ సినిమాతో సాధించాడు నాగ చైతన్య. ఈసినిమాతో 30 కోట్లు చేసి రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇక్కడ పూర్తి క్రెడిట్ నాగ చైతన్య కి ఇవ్వలేం. తన భార్య సమంత కి కూడా చెందుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫౌండేషన్ మీద నెక్స్ట్ లెవల్‌కి చేరుకోవడానికి నాగచైతన్యకి ఇదే మంచి తరుణమని చెప్పాలి.
వెంకీ – చైతు చేస్తున్న ‘వెంకీ మామ’ చిత్రం కూడా సూపర్ హిట్ అయితే చైతు మార్కెట్ కి రెక్కలొచ్చినట్టే అవుతుంది. ఒకవేళ ఈసినిమా కూడా పెద్ద సక్సెస్ అయితే ఇందులో వెంకీ క్రెడిట్ కూడా ఉంటది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకే చోట కదలకుండా ఆగిపోయిన తన మార్కెట్‌కి మాత్రం ఖచ్చితంగా చలనం వస్తుంది. చైతు కి ఇదే సరైన సమయం. తన మార్కెట్ ని సరైన దారిలో తీసుకుని వెళ్ళడానికి.
అయితే చైతుని ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మిగతా హీరోల మాదిరిగా ఎక్కువ రాంగ్ స్టెప్స్ వేయకుండా, తనంతట తానే మంచి చిత్రాలని లైన్లో పెట్టడం గొప్ప సంగతే మరి. సో చైతు నెక్స్ట్ మూవీ వెంకీ మామ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంద్దాం