ఎప్పటిలాగే జబర్దస్త్ షో ఉంటుంది కానీ..

ఈటివి జబర్దస్త్ షో.. ఇప్పుడిది కామెడీ షో కన్నా కాంట్రవర్సీ షో గా పాపులర్ అయ్యింది. ఈటివి లో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకి ఎక్సట్రార్డినరీ [more]

Update: 2019-11-22 05:41 GMT

ఈటివి జబర్దస్త్ షో.. ఇప్పుడిది కామెడీ షో కన్నా కాంట్రవర్సీ షో గా పాపులర్ అయ్యింది. ఈటివి లో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకి ఎక్సట్రార్డినరీ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఇన్నేళ్లు గడిచిన జబర్దస్త్ షోకి పాపులారిటీ తగ్గలేదు,టీఆర్పీ తగ్గలేదు. అలాంటి షో ఇప్పుడు కాంట్రవర్సీలతో నలిగిపోతుంది. మల్లెమాల టీం కి నాగబాబు కి మధ్యన తలెత్తిన విభేదాలు తార స్థాయికి చేరడంతో… నాగబాబు జబర్దస్త్ నుండి జెండా పీకెయ్యడంతో మొదలైన కథ… ఇప్పుడు జబర్దస్త్ షో అయినా ఉండాలి, లేదంటే ఎక్స్ట్రా జబర్దస్త్ షో అయినా ఉండాలి అనే స్థాయికి వచ్చేసింది యవ్వారం. ఎందుకంటే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కిట్స్ చేసే కమెడియన్ స్ ఒక్కొక్కరిగా నాగబాబు తో పాటుగా పక్క ఛానల్స్ కి జారుకుంటున్నారు.

కొంతమంది మాత్రం జబర్దస్త్ లో ఉన్నారు కాని… చాలామంది పేరున్న జబర్దస్త్ కమెడియన్స్ వేరే ఛానల్స్ కి వెళ్లిపోతున్నారు. మరి ఇలాంటి టైం లో జబర్దస్త్ షో నడపడం కష్టమే. కానీ ఆ షో ని వదులుకుని తమ క్రేజ్ ని పోగొట్టుకునే ఆలోచన మల్లెమాల టీం చెయ్యడం లేదు. అందుకే జేడ్జ్ తో పాటుగా ముగ్గురునలుగురు మెయిన్ కమెడియన్స్ టీం వెళ్లిపోవడంతో.. ముందు కాస్త ఇబ్బంది పడినా… తర్వాత సర్దుకోవచ్చని, ఒక వేళ ఆలా సర్దుకోలేకపోతే గనక జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లలో ఓ షో ని ఆపేసి… అంతా కలిపి జబర్దస్త్ గానో, లేదంటే ఎక్స్ట్రా జబర్దస్త్ గానో పెట్టి… ఇప్పుడున్న టీమ్స్ నుండి క్రేజున్న టీమ్స్ ని, బెస్ట్ స్కిట్స్ చేసే టీమ్స్ ని ఏరుకుని వాళ్లతోనే అదిరిపోయే కామెడీ స్కిట్స్ చేయించాలని చూస్తున్నారట. మరి ఇప్పటివరకు గురు, శుక్రవారాల్లో దాదాపు గంటన్నర పటు.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే ఎంజాయ్ చేసే అవకాశాలు ఉండేలా కనబడుతుంది వ్యవహారం.

Tags:    

Similar News