మార్చి 8 నుంచి ‘మిస్సెస్ సుబ్బలక్ష్మీ’

విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి మంచు లక్ష్మి. వెండితెర, బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన మంచు లక్ష్మి… ఇప్పుడు వెబ్ సిరీస్ [more]

Update: 2019-03-05 09:42 GMT

విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి మంచు లక్ష్మి. వెండితెర, బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన మంచు లక్ష్మి… ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఆడియెన్స్ ని కూడా ఎంటర్ టైన్ చేయనుంది. మిసెస్ సుబ్బలక్ష్మి పేరుతో రూపొందించిన వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేసింది. తొలిసారిగా మంచు లక్ష్మి వెబ్ సిరీస్ ద్వారా ఆడియెన్స్ ముందుకు రానున్నారు. మార్చి నుంచి ZEE5 యాప్ ద్వారా మిసెస్ సుబ్బలక్ష్మి ఎపిసోడ్స్ ని వీక్షించొచ్చు. వంశీ ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు. శ్రీనివాస్ అవసరాల, వేణు టిల్లు, మహేష్ విట్ట, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావ్, చిత్రం శ్రీను ఇతర కీలక పాత్రలు పోషించారు.

అనేక ట్వీస్టులతో…

భర్త తనతో సమయం గడపకపోవటం, ప్రేమని పంచకపోవటం తో తనతో తానే ఒక స్వేచ్ఛాయుతమైన జీవితం గడపాలనుకునే పాత్రలో మంచు లక్ష్మి నటించారు. తనకు నచ్చినట్టుగా, తాను మెచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతున్న క్రమంలో ఓ అనుకోని సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇంతకూ ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, తాను అనుకున్న లైఫ్ ని లీడ్ చేయగలిగిందా లేదా, మిసెస్ సుబ్బలక్ష్మి అనుకున్నది సాధించిందా లేదా అన్నది తెలియాలంటే మార్చి 7 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆడియెన్స్ ని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ అనేక ట్విస్టులు, ఎంటర్ టైన్ మెంట్ తో సాగే ఈ ఎపిసోడ్స్ ని రూపొందించామని జీ 5 నెట్ వర్క్ ప్రతినిధి తెలియజేశారు.

Tags:    

Similar News