అందుకే వాళ్లిద్దరూ కలవలేదు!!

గతంలో సూపర్ స్టార్ మహేష్ – ఇళయదళపతి విజయ్ కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ రాబోతుంది అని.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మహేష్ – విజయ్ క్రేజ్ [more]

Update: 2020-06-15 04:06 GMT

గతంలో సూపర్ స్టార్ మహేష్ – ఇళయదళపతి విజయ్ కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ రాబోతుంది అని.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మహేష్ – విజయ్ క్రేజ్ కి తగ్గట్తుగా ఓ భారీ స్క్రిప్ట్ తో మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారనే ప్రచారం జరగడమే కాదు.. మహేష్ – విజయ్ లు ఈ సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అన్నారు. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత మహేష్ కానీ, విజయ్ కానీ ఆ సినిమాపై ఎక్కడా పెదవి విప్పలేదు. అయితే తాజాగా మహేష్ – విజయ్ బడా మల్టీస్టారర్ ఆగిపోవడానికి ఓ కారణముంది అని దర్శకుడు మణిరత్నం భార్య సుహాసిని చెబుతుంది.

ప్రస్తుతం మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ని విక్రమ్, కార్తీ, జయం రవిలతో పాటు మోహన్ బాబు, ఐశ్వర్యారాయ్, త్రిషా వంటి పేరున్న నటులతో తెరకెక్కిస్తున్నాడు. గతంలో మహేష్ – విజయ్ లతో మని సర్ చెయ్యాలనుకున్న సినిమా మణి డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సినిమానే. అయితే వాళ్లిద్దరూ ఆ సినిమా అప్పట్లో చేయకపోవడానికి కారణం మాత్రం నాలుగేళ్ళ క్రితం ఈ భారీ పీరియడ్ డ్రామాకు దర్శకుడు మణిరత్నం ఆలోచనలకు తగ్గట్టుగా వి ఎఫ్ ఎక్స్ వర్క్ చేసే టీమ్ దొరకలేదట. అందుకే మణిరత్నం అప్పట్లో మహేష్, విజయ్ లతో పొన్నియిన్ సెల్వన్ చేద్దామనుకున్న ఆలోచన విరమించుకున్నాడట. మరి అప్పుడు గనక మణి ఆ సినిమాని తెరకెక్కించినట్టైతే ఆ సినిమా తెలుగు, తమిళ బాక్సాఫీసులని షేక్ చేసే పారేసేది. 

Tags:    

Similar News