మణి రత్నం కోరిక తీరేనా?

ప్రస్తుతం చాలామంది దర్శకులు ఓటిటీస్ కోసం వెబ్ సీరీస్ మొదలెట్టడానికి తహతహలాడుతున్నారు. తెలుగులో చాలామంది దర్శకులు ఇప్పుడు ఈ వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. [more]

Update: 2020-07-22 05:03 GMT

ప్రస్తుతం చాలామంది దర్శకులు ఓటిటీస్ కోసం వెబ్ సీరీస్ మొదలెట్టడానికి తహతహలాడుతున్నారు. తెలుగులో చాలామంది దర్శకులు ఇప్పుడు ఈ వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్స్ వ్యవస్థ కోలుకునేలా లేదు. భారీ బడ్జెట్ అంటూ సినిమాలు తీసే అవకాశం కరోనా చంపేసింది. ఇక ఓటిటీల ప్రాధాన్యంతో  వెబ్ సీరీస్ ల ప్రాధాన్యం బాగా పెరిగింది. అయితే ఇప్పుడు తమిళ లెజెండ్రీ దర్శకుడు మణి రత్నం ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేసాడు. ఆ వెబ్ సీరీస్ పేరు కూడా వెరైటీ గా నవరసం అని పెట్టడం, ఆ నవరసం అని పేరుకి తగ్గట్టుగా ఈ వెబ్ సిరీస్ల లో తొమ్మిది ఎపిసోడ్స్ ఉండబోతున్నాయట. ఆ తొమ్మిది ఎపిసోడ్స్ లో… ఒక్కో ఎపిసోడ్‌లోనూ ఒక్కో హీరో అంతేకాకుండా ఒక్కో జోన‌ర్‌లో ఉండడమే కాకుండా…. ప్ర‌తీ ఎపిసోడ్ కీ ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఉంటాడట.

మరి నవరసం వెబ్ సీరీస్ సౌత్ ఇండియా టార్గెట్ చేసింది. అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్నమాట. అందుకే నాలుగు భాషల హీరోస్ ని ఈ నవరసంలో మణి సర్ భాగం చెయ్యబోతున్నాడు. నాలుగు భాషల నటులు నాలుగు భాషలకు సుపరిచితం అయ్యేవారినే మణి ఈ వెబ్ సీరీస్ కోసం ఎంపిక చేయబోతున్నాడట. ఇప్పటికే తమిళంలో సూర్య‌, సిద్దార్థ్‌, మాధ‌వ‌న్‌ల‌ను ఎంపిక చేసిన మణి రత్నం తెలుగులో నాగ చైతన్య కానీ, నాగార్జున, నాని లతో కానీ.. మణి రత్నం తెలుగు జోనర్ వెబ్ సీరీస్ కోసం సంప్రదించేపనిలో ఉన్నదని అంటునాన్రు. మరి తమిళ హీరోలు వెబ్ సీరీస్ కోసం వెనక ముందు చూసుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ.. తెలుగు హీరోలు అంత త్వరగా వెబ్ సీరీస్ కోసం ఒప్పుకునే రకాలు కారు. మరి మణిరత్నం కోరిక ఎంతవరకు .. నెరవేరుతుందో కానీ… ప్రస్తుతం ఈ హీరోల కోసం మణి సర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా టాక్. 

Tags:    

Similar News