మన్మధుడుని మరిపించడం ఖాయమట..!
గతంలో నాగార్జున – సోనాలి బింద్రే కాంబోలో వచ్చిన మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బ్రహ్మి కామెడీ, నాగ్ పంచ్ డైలాగ్స్ [more]
గతంలో నాగార్జున – సోనాలి బింద్రే కాంబోలో వచ్చిన మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బ్రహ్మి కామెడీ, నాగ్ పంచ్ డైలాగ్స్ [more]
గతంలో నాగార్జున – సోనాలి బింద్రే కాంబోలో వచ్చిన మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బ్రహ్మి కామెడీ, నాగ్ పంచ్ డైలాగ్స్ అన్నీ సినిమాలో అదరగొట్టేశాయి. మన్మధుడుకి మాటలు అందించిన త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ అడుగడుగునా ప్రేక్షకులను మైమరపించాయి. అందుకే మన్మధుడు సినిమాకి ఇప్పటికీ బోలెడంత క్రేజ్ ఉంది. ఇప్పటికీ బుల్లితెర మీద మన్మధుడు సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుడు టీవీలకు అతుక్కుపోతారంటే ఆ సినిమాకెంత క్రేజుందో చెప్పొచ్చు. ఇక నాగార్జునకి కూడా మన్మధుడు కెరీర్ బెస్ట్. మరి ఆ రేంజ్ హిట్ సినిమాకి సీక్వెల్ అంటే అదే రేంజ్ లో ఉండాలి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రీసెంట్ గా మొదలైన మన్మధుడు 2 సినిమా మన్మదుడుకి ఏ మాత్రం తీసిపోని కామెడీ ఎంటెర్టైనెర్ గా ఉండబోతుందన్నమాట.
పంచ్ డైలాగ్స్, కామెడీతో…
త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కి ఏ మాత్రం తీసిపోని పంచ్ లు మన్మధుడు 2లో నాగార్జున, వెన్నెల కిషోర్ లతో పాటుగా హీరోయిన్ రకుల్ మీద కూడా రాహుల్ రాసుకున్నాడట. మరి మన్మధుడు సినిమాని మన్మధుడు 2 మించి హిట్ అవడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తుంది మన్మధుడు 2 టీం. మరి ఇప్పటికే నాగ్ – రకుల్ మీద కీలక సన్నివేశాల చిత్రీకరణలో మన్మధుడు టీం బిజీగా ఉందట. ఇక రకుల్ మీద కూడా కొన్ని కీలక సన్నివేశాలను రాహుల్ తెరకెక్కిస్తున్నాడట. మరి త్రివిక్రమ్ కి పోటీగా మన్మధుడు 2లో ఎలాంటి పంచ్ లు, కామెడీ ఉండబోతుంది అనేది కాస్త వేచి చూస్తే గానీ తెలియదు.