పెళ్లి విషయం చెప్పకుండా… ఏదేదో చెప్తావేంటయ్యా?

మెగా ఫ్యామిలి పెళ్లి అంటే ఆ సందడే వేరు. రామ్ చరణ్, అల్లు అర్జున్ పెళ్లిళ్లు చాల ధూమ్ ధామ్ గా ఓ రేంజ్ లో జరిగాయి. [more]

Update: 2020-07-05 08:52 GMT

మెగా ఫ్యామిలి పెళ్లి అంటే ఆ సందడే వేరు. రామ్ చరణ్, అల్లు అర్జున్ పెళ్లిళ్లు చాల ధూమ్ ధామ్ గా ఓ రేంజ్ లో జరిగాయి. అలాగే చిరు పెద్ద కూతురు పెల్లి ఎప్పుడో జరిగినా… రెండేళ్ల క్రితం చిరు చిన్న కూతురు శ్రీజ రెండో వివాహాన్ని చిరు అండ్ ఫ్యామిలీ అంగరంగ వైభవంగా చేసింది. పెళ్లి కూతుర్ని చెయ్యడం దగ్గరనుండి.. పెళ్లి వరకు శ్రీజ కళ్యాణం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక తాజాగా మెగా ఫ్యామిలి లో మరో అమ్మాయి పెళ్లి జరగబోతుంది. హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్న మెగా డాటర్ నిహారిక పెళ్లి పీటలెక్కబోతుంది. నిహారిక తాజాగా తనకు కాబోయే వరుడు జొన్నలగడ్డ చైతన్య ని సోషల్ మీడియాలో అందరికి పరిచయం చేసింది. చైతు ఆరడుగుల అందగాడు. నిహారిక కి తగిన జోడి. వారిద్దరి ప్రీ ఎంగేజ్మెంట్ షూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంత జరిగిన నాగబాబు పనికిరాని విషయాలను మాట్లాడుతున్నాడు కానీ.. కూతురి పెళ్లి విషయం మాట్లాడడం లేదు.

తాజాగా నాగబాబు కూతురు నిహారిక పెళ్లి విషయంపై పెదవి విప్పాడు. అసలు చైతన్య ఎలా తగిలాడో చెప్పలేదు కానీ.. మా ఇంట్లో పెళ్లి పబ్లిక్ ఈవెంట్ కాదు.. ప్రవేట్ ఈవెంట్ అంటూ కాస్త గుస్సా అయ్యాడు. అలాగే పెళ్ళి హడావిడిగా ఏం  చెయ్యట్లేదు.. ప్రభుత్వ నిబంధనలకు లోబడే పెళ్లి ఏర్పాట్లు ఉంటాయి అంటున్నాడు. ఇక నిహారిక – చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్ధం అయ్యాకే నిహారిక పెళ్లి విషయాలు మాట్లాడుతా అంటున్నాడు. మరి సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అంటే మీడియా ఫోకస్ ఉంటుంది అని నాగబాబు కి తెలుసు. అయినా ఇలా మాట్లాడడం ఎం బాలేదు. మెగా ఫాన్స్ నిహారిక పెళ్లి ఎప్పుడెప్పుడా అని… ఏ ముచ్చట్లు చెబుతారా అని ఎదురు చూస్తుంటే.. నాగబాబు మాత్రం మా పెళ్లి ప్రవేట్.. మా ఇంటి విషయం, పబ్లిక్ కాదు చెప్పడానికి అంటే ఎలా బాబు.. నాగబాబు. 

Tags:    

Similar News