నేడు ఫిలిం ఛాంబర్ లో కీలక భేటీ
నేడు ఫిలిం ఛాంబర్ లో సినీ ప్రముఖుల సమావేశం జరగనుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం జరగనుంది
నేడు ఫిలిం ఛాంబర్ లో సినీ ప్రముఖుల సమావేశం జరగనుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. ఫిలిం ఛామబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్టూడియో సెక్టార్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఓటీటీలతో...
ప్రధానంగా ఓటీటీ వల్ల ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తారు. సినిమా విడుదలయిన తర్వాత ఎన్నిరోజులకు ఓటీటీలో విడుదల చేయాల్సి ఉందన్న దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. దీనిపై కొత్త నిబంధనలను విధించనున్నారు. ఆరు కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలు నాలుగు వారాలు, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు పది వారాల పాటు ఓటీటీలో రిలీజ్ చేయకూడదని గడువు విధించింది. అలాగే టిక్కెట్ల రేట్లను కూడా ఫిలిం ఛాంబర్ నిర్ణయించిందని తెలిసింది. విపీఎస్ ఛార్జీలు, టిక్కెట్ ధరలు, ఉత్పత్తి వ్యయం, పని పరిస్థితులు, ఫైటర్స్ యూనియన్ సభ్యులు సమస్యలతో పాటు ఫెడరేేషన్ సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. సమావేశంలో సభ్యుల సూచనల మేరకే షూటింగ్ లపై ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.