గ్యాంగ్ లీడర్ టైటిల్ పై స్పందించిన మెగా కాంపౌండ్ ..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అంతా నానిపై ఫైర్ అవుతున్నారు. అందుకు కారణం నాని తన నెక్స్ట్ మూవీకి గ్యాంగ్ లీడర్ టైటిల్ ని వాడుకోవడమే. [more]

Update: 2019-02-26 08:30 GMT

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అంతా నానిపై ఫైర్ అవుతున్నారు. అందుకు కారణం నాని తన నెక్స్ట్ మూవీకి గ్యాంగ్ లీడర్ టైటిల్ ని వాడుకోవడమే. అప్పట్లో గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. అటువంటి పవర్ ఫుల్ టైటిల్ ను మెగాస్టార్ చిరంజీవి లేదా మెగా హీరోస్ కాకుండా వేరే వాళ్లు వాడుకోవడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ మాత్రమే అని వీలైనంత త్వరగా టైటిల్ మార్చమని మెగా ఫ్యాన్స్ బాగానే రచ్చ చేస్తున్నారు. అసలు ఈ టైటిల్ గీత ఆర్ట్స్ కానీ, కొణిదెల ప్రొడక్షన్స్ వారు కానీ ముందే రిజిస్టర్ చేయించుకుని ఉంటే ఇప్పుడు ఆ టైటిల్ ను వేరేవాళ్లు వాడేకునే వారు కాదు కదా అని అంటున్నారు ఫ్యాన్స్. ఫ్యూచర్ లో రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ ఈ టైటిల్ వాడుకునేవారు అంటున్నారు.

నానికి గ్రీన్ సిగ్నల్…

అయితే ఇంత రచ్చ జరుగుతుంటే మెగా కాంపౌండ్ నుంచి ఎవరూ స్పందించారా? అంటే అది కూడా జరిగింది. కానీ అటువైపు నుంచి వేరే వెర్షన్ వచ్చిందట. ఇలా చిరంజీవి నటించిన సినిమాల్లో మెయిన్ టైటిల్స్ అన్నీ రిజిస్టర్ చేయించుకుని వెళ్తే మనీ వేస్ట్ అవుతుంది తప్ప వేరేది ఏమీ లేదు అని అంటున్నారు. నిజమే చిరంజీవి 150 సినిమాల్లో ఎంత లేదన్నా అలాంటివి యాభైకి పైగానే ఉన్నాయని మరి వాటిని ఎలా మేనేజ్ చేయాలని ప్రశ్నించారట. ఇందులో లాజిక్ లేకపోలేదు. కాబట్టి మెగా కాంపౌండ్ నుండి నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే.

Tags:    

Similar News