నానిపై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్..!

నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు మేకర్స్. చిన్న వీడియో బిట్ వదిలి [more]

Update: 2019-02-25 10:25 GMT

నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు మేకర్స్. చిన్న వీడియో బిట్ వదిలి అందులో గ్యాంగ్ లీడర్ అంటూ రిలీజ్ చేసారు. అలా రిలీజ్ చేసారో లేదో వెంటనే మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చిన్నపాటి వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ మార్చకపోతే బాయ్ కాట్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ టైటిల్ ను మెగా ఫామిలీ హీరోస్ పెట్టుకుంటే ఆలోచిస్తాం కానీ బయట వ్యక్తులు పెట్టుకోవడం ఏంటని నిరసన తెలియజేశారు. ట్విట్టర్ లో మైత్రి మూవీస్ బ్యానర్ ని ట్యాగ్ చేస్తూ ఈ పోస్టులు పెట్టారు. నిజానికి ఈ టైటిల్ తో రామ్ చరణ్ వద్దామనుకున్నాడు.

టైటిల్ మార్చాల్సిందే…

బోయపాటితో చేసిన సినిమాకు ఇదే టైటిల్ పెడదామని డిసైడ్ అయ్యి చివరికి వద్దు అనుకుని వినయ విధేయ రామ టైటిల్ తో కానిచ్చేశారు. అలానే సాయి ధరమ్ తేజ్ ఈ టైటిల్ ను వాడుకుందామనుకున్నాడు కానీ వాడుకోలేదు. అయితే, మెగా ఫామిలీకి ఎటువంటి సంబంధం లేని నాని ఎలా వాడుకుంటాడు? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా టైటిల్ ని మార్చమని లేదంటే తమ నుంచి నిరసనలు, బాయ్ కాట్ ఎదురుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి నాని – విక్రమ్ కుమార్ ఈ టైటిల్ పై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News