పుష్ప ట్రైలర్ అప్ డేట్ ఇదే
అల్లు అర్జున్ నటించిన పుప్ష ట్రైలర్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
అల్లు అర్జున్ నటించిన పుప్ష ట్రైలర్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెడ్ శ్యాండిల్ మాఫియా చుట్టూ తిరిగే కథనంతో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. పుష్ప చిత్రాన్ని వచ్చే నెల 17వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే నిర్ణయించారు. అయితే పుష్ప ట్రైలర్ డిసెంబరు మొదటి వారంలో విడుదల అవుతుందని మొదట అనుకున్నారు.
మెరుగులు దిద్దాలని....
కానీ ట్రైలర్ కు ఇంకా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉండటంతో రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తున్నారు. సమంత స్పెషల్ సాంగ్ లో కన్పించనుంది. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.