విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో జీఏ 2, యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్ కె ఎన్ నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా ఘనవిజయం సాధించి భారీ ఓపెనింగ్స్ తో అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. మెగా అభిమానిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి... పిఆర్వో గా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసి... నిర్మాతగా టాక్సీవాలా చిత్రాన్ని రూపొందించి సక్సెస్ అందుకొని మెగాస్టార్ అభినందనలు అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని రోజని నిర్మాత ఎస్ కె ఎన్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు.