మెగా అభిమానులు హార్ట్ అవుతారేమో

మెగా స్టార్ చిరంజీవి 151 వ సినిమాగా చారిత్రాత్మక చిత్రం సై రా నరసింహ రెడ్డి చేస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని సై రా నరసింహ [more]

Update: 2019-07-04 05:40 GMT

మెగా స్టార్ చిరంజీవి 151 వ సినిమాగా చారిత్రాత్మక చిత్రం సై రా నరసింహ రెడ్డి చేస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని సై రా నరసింహ రెడ్డిగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే కంప్లీట్ చేసుకుంది. సై రా నరసింహ రెడ్డి గెటప్ లో చిరంజీవి అదుర్స్ అన్న రేంజ్ లో ఉన్నాడనే విషయం సై రా ఫస్ట్ లూక్లోనే చూసేసాం. చిరు కున్న ఫ్యాన్ ఇమేజ్ కి సై రా లాంటి చారిత్రాత్మక చిత్రం చెయ్యడం మాములు విషయం కాదు. మరి ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలు చేసేటప్పుడు… హీరోల్లో మాస్ ఇమేజ్ కానీ, అలాగే ఆ హీరోలనుండి మాస్ స్టెప్స్ కానీ ఆశించడం కరెక్ట్ కాదు. అందులోను చిరంజీవి చేసింది ఒక స్వాతంత్య్ర సమరయోధుడు కేరెక్టర్.

అయితే సై రా సినిమాలో ఒక జానపద గీతానికి చిరు మాస్ స్టెప్స్ వెయ్యాల్సి వచ్చిందట . అయితే ఆ తర్వాత ఆ పాట చూసిన చిరు కి ఓ డౌట్ వచ్చిందట. ఒక స్వాతంత్య్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ ఇలాంటి మాస్ స్టెప్స్ వేస్తె బావుండదని అనిపించి వెంటనే ఆ మాస్ స్టెప్స్ ని తీసేశారట. మరా మాస్ స్టెప్స్ లేకపోతె చిరు అభిమానులు ఎలా తట్టుకున్టారో…. అంతేకాదు క్లైమాక్స్ విష‌యంలోనూ చిరు, సురేంద‌ర్‌రెడ్డి బాగా ఆలోచించించారట. ఎందుకంటే స్వతహాగా ఒరిజినల్ ఉయ్యాలవాడ కథలో నరసింహారెడ్డి తలను బ్రిటీష్‌వారు న‌రికి, కోట గుమ్మానికి వేలాడ‌దీస్తారు. మరి అదే క్లైమాక్స్ గా ప్లాన్ చేసి చిరు తలను కోటగుమ్మానికి వేలాడదీస్తే గా అభిమానులు ఒప్పుకుంటారా… ఇలాంటి విషాదాంత క్లైమాక్స్ ని వారు జీర్ణించుకోగలరా.. అనేది సురేందర్ రెడ్డి, చిరు అలోచించి చివరికి ఉన్నది ఉన్నట్టుగా అంటే చరిత్రని ఏమాత్రం వక్రీకరించకుండా అలాంటి విషాదాంత క్లైమాక్స్ ని ఫాలో అయినట్లు సమాచారం.

Tags:    

Similar News