Chiranjeevi : మెగాస్టార్ కు మరో అరుదైన గౌరవం
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చిరంజీవికి గోల్డెన్ వీసాను అందించింది
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చిరంజీవికి గోల్డెన్ వీసాను అందించింది. ఇటీవలే చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ఈ గోల్డెన్ వీసాతో సత్కరిస్తుంది. దీనిని అరుదైన గౌరవంగా భావిస్తారు.
పదేళ్ల కాలపరమితితో...
ఇప్పటి వరకూ గోల్డెన్ వీసాను అందుకున్న వారిలో రజనీకాంత్, అల్లు అర్జున్, షారుక్ ఖాన్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్ లాల్, మమ్ముట్టి, టొవినో ధామస్ లు ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి వీరి జాబితాలో చేరారు. పదేళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ గోల్డెన్ వీసాను అందిస్తుంది. గోల్డెన్ వీసాను అదుకున్న చిరంజీవికి టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.