చిరంజీవి గారు నాకు స్ఫూర్తి : హీరో సూర్య
"ఎతర్క్కుం తునింధవన్" యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు పాండి రాజు దర్శకత్వం వహించగా..
కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య నటించిన తాజా సినిమా "ఎతర్క్కుం తునింధవన్". చాలా కాలం తర్వాత సూర్య నటించిన సినిమా థియేటర్లలో విడుదలవ్వనుంది. అంతకుముందు సూర్య ముఖ్య పాత్రలో వచ్చిన జై భీమ్ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. సుమారు రెండేళ్ల తర్వాత సూర్య మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా విషయానికొస్తే "ఎతర్క్కుం తునింధవన్" యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు పాండి రాజు దర్శకత్వం వహించగా.. సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు. "ఎతర్క్కుం తునింధవన్"(ఈటీ) తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read : దక్షిణకోస్తా , రాయలసీమకు వాయుగుండం ముప్పు
తాజాగా "ఎతర్క్కుం తునింధవన్" సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు రానా, సురేష్ బాబు, బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. "నేను మీలో ఒకడిని. మిమ్మల్ని కలవక దాదాపుగా రెండేళ్లకు పైగా అయిపోతోంది. సినీ పరిశ్రమలో నాకు మెగాస్టార్ చిరంజీవి గారు స్ఫూర్తి. ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని, నేను స్ఫూర్తి పొంది.. అగరం ఫౌండేషన్ ను స్థాపించి సేవలు అందిస్తున్నాను" అని సూర్య తెలిపారు.