మెగాస్టార్ మంచి మనసు

మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు.;

Update: 2023-04-18 05:45 GMT

మెగాస్టార్ చిరంజీవికి తొలి నుంచి సేవా కార్యక్రమాలు చేయడం ఇష్టం. అందులో కళాకారులు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందిస్తారు. ఆయన ఎందరో కళకారులకు ప్రాణ బిక్షపెట్టారు. ఖరీదైన వైద్యాన్ని తన సొంత డబ్బులు ఖర్చుచేసి అందించారు. ఇక కోవిడ్ సమయంలోనూ పేద కళాకారుల కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటుచేసి వారిని అన్ని విధాలుగా ఆదుకున్నారు. చిరంజీవి చిత్ర పరిశ్రమకు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు.

మొగిలయ్యకు...
తాజాగా బలగం సినిమాలో నటించిన మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయనకు కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా షుగర్ వ్యాధి ఉండటంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే షుగర్ వ్యాధి, రక్తపోటు కారణంగా ఆయనకు చూపు మందగించింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని బలగం డైరెక్టర్ వేణుకు ఫోన్ చేసి చెప్పిన విషయం బయటకు రావడంతో మెగస్టార్ మంచి మనసును మెచ్చుకుంటున్నారు.


Tags:    

Similar News